అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
ఆత్మకూరు(ఎం): అంత్యక్రియలకు వచ్చి తిరిగివెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మం డలంలోని చాడ-చందెపల్లి గ్రామాల నడుమ ఆదివారం రాత్రి చోటు చేసుకంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరుకు చెందిన గజరాజు వెంకటేష్(45) మండలంలోని సర్వేపల్లికి చెందిన మరిపెల్లి స్వామి శనివారం గుండెపోటుతో మృతి చెందడంతో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనటానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో చాడ గ్రామ శివారులో రోడ్డుపై మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన వెం కటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి అల్లుడు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ లాక్యానాయక్ తెఇపారు.
ఇనుపాముల శివారులో రిటైర్డ్ ఉద్యోగి..
కేతేపల్లి: మండలంలోని ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉద్యోగి సాకుంట్ల వెంకులు(59) వ్యక్తిగత పని మీద టీవీఎస్ మోపెడ్‌పై కేతేపల్లి మండలం కొండకిందిగూడెం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నకిరేకల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో ఓ మహిళ లిఫ్ట్ అడగటంతో బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఇనుపాముల సమీపంలో ముందు వె ళ్తున్న ట్రాక్టర్‌ను ప్రమాదవశాత్తు వెనుక వైపునుంచి ఢీకొట్టాడు. ఈప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకులుకు, వెనకాల కూర్చు న్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 1033 ఆంబులెన్స్‌లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకులు మృతి చెందాడు. గాయపడిన మహిళ వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ లక్ష్మణస్వామి తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
Published Tue, Dec 16 2014 2:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement