
మానకొండూర్: కరీంనగర్‌జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి వద్ద బ్రిడ్జిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలు రెండూ బ్రిడ్జిపై అడ్డంగా తిరగడంతో కరీంనగర్-వరంగల్ రహదారిపై రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రెండు వైపులా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.