సిద్దిపేట రూరల్/చిన్నకోడూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో మంగళవారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా.. సిద్దిపేట మండలం లింగారెడ్డి గ్రామానికి చెందిన దేశెట్టి భద్రయ్య (68) భార్య రాఘవ్వతో కలిసి ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా వడదెబ్బకు గురైన తీవ్ర అస్వస్థతకు గురైన భద్రయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వర్షం వస్తుండడంతో నివాసం ఉంటున్న గుడిసె కూలిపోయింది. కాగా అంతకు మందే అతను ఇంటి ముందు కూర్చుని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారు ఆర్థికంగా లేకపోవడంతో గ్రామస్తులు పలువురు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాఘవ్వ ఉంది. దీంతో ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బొండ్ల రామస్వామి, మాజీ సర్పంచ్ రాజయ్య, నాయకులు పరశురాములు, రామాగౌడ్‌లు కోరారు.
వడదెబ్బతో మహిళా కూలీ మృతి
చిన్నకోడూరు : వడదెబ్బతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని విఠలాపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దండెబోయిన ఎల్లవ్వ (60) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో ఉపాధి హామీ కూలీ పనులకు వెళుతోంది.
ఈ క్రమంలో వడదెబ్బ తగిలి సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. మంగళవారం చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో ఎల్లవ్వ మృతి చెందింది. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ సురేందర్‌రెడ్డి కోరారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ మండల కన్వీనర్ సుంచు రమేష్, నేతలు పుష్పలతలు పరామర్శించి ఓదార్చారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
Published Tue, May 27 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement