
దహన సంస్కారాలకు వెళ్లి వస్తూ..
దహన సంస్కారా లు పూర్తి అయిన అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో బానోతు వీరన్న తన ద్విచక్ర వాహనంపై అజ్మీరా రా జుతో కలసి నర్సంపేట వైపునకు వస్తున్నాడు. బుధరావుపేట గ్రామం దాటిన తర్వాత సంగెం కాల్వ స మీపంలో రాగానే ఎదురుగా అతివేగంతో వచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బానోతు వీరన్న, అజ్మీరా రాజులు అక్కడికక్కడే మృ తి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోని బోరున విలపించారు.
ప్రమాదానికి కారణ మైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై దుడ్డెల గురుస్వామి ఆందోళనకారులతో మాట్లాడి పరి స్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృ తుడు బానోతు వీరన్నకు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అజ్మీరా రాజుకు భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు.