అప్పుల బాధలు భరించలేక జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బుధవారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
జహీరాబాద్ టౌన్/మెదక్ మున్సిపాల్టీ : అప్పుల బాధలు భరించలేక జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బుధవారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు యువ రైతు కాగా మరొకరడు స్వర్ణకారుడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి తండాకు చెందిన రాథోడ్ సంతోష్ (32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న ఎకరం పొలంలో బోరు వేసి చెరకు పంట సాగు చేస్తున్నాడు.
అయితే కుటుంబ పోషణ, పొలంలో బోరు వేయడానికి ఇతరత్రా ఖర్చులకు సుమా రు రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. అ యితే రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో సంతోష్ భార్య గంగుబాయి కర్ణాటకలో ని చిడుగుప్పలో ఉన్న పుట్టింటికి వెళ్లిం ది. దీంతో బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
స్వర్ణకారుడు ఆత్మహత్య
అప్పులబాధతో స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేటకు చెందిన సంతోష్‌కుమార్ చారి (28) కొంతకాలంగా భార్యా పిల్లలతోపట్టణంలోని బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్నాడు. కులవృత్తి అయి న అవుసుల పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో వృత్తి పని సరిగా నడవక అప్పులు పెరిగిపోయా యి. మరోవైపు కుటుంబ పోషణ భారం గా మారింది. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్‌కుమార్ బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలోనే బయటకు వెళ్లిన సంతోష్‌కుమార్ భార్య సరిత ఇంటికి చేరుకుని చూడగా లోపల గడియ పెట్టి ఉండడంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా సంతోష్ కుమార్ ఉరేసుకుని కనిపిం చాడు.
పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ మృతదేహాన్ని మెదక్ తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కొమురయ్య తెలిపారు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.