ఇద్దరు కూలీల దుర్మరణం | Two workers died in Road accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూలీల దుర్మరణం

Published Thu, May 21 2015 12:48 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Two workers died in Road accident

 కట్టంగూర్
  మండలంలోని పామనగుండ్ల శివారు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం మండలంలోని పరడ గ్రామానికి చెందిన మాగి భిక్షం(60), కోనేటి యాదయ్య (55), సుంకరబోయిన వెంకన్నలు పామనగుండ్ల శివారులో రోజువారీగా కట్టెలు కొట్టేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామం పరడకు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై ముగ్గురు బయలుదేరారు. పామనగుండ్ల శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షం, యాదయ్యలు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన వెంకన్నను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement