two workers died
-
ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం...
సాక్షి, నిజామాబాద్: ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ డ్రైనేజీ మరమ్మతులు చేస్తుండగా రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మట్టిలో మృత దేహాలు కూరుకుపోవడంతో జేసీబీ, ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రపూర్‌క్ చెందిన కిషోర్, బాదల్‌గా గుర్తించారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
ఇద్దరి ఉసురు తీసిన విద్యుదాఘాతం
మార్కాపురం : ఫ్యాక్టరీలో పలకల పని చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలో సోమవారం జరి గింది. వివరాలు.. మండలంలోని వేములకోటకు చెందిన ఎలకపాటి కోటమ్మ (40), పట్టణంలోని కంభం రోడ్డులో నివాసం ఉంటున్న గూడెం శివారెడ్డి(35)లు ఎం.రమణ పలకల ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఫ్యాక్టరీకి వచ్చి కార్మికులు యథావిధిగా పనిచేస్తు న్న సమయంలో విద్యుదాఘాతానికి గురై సంఘటన స్థలంలోనే కోటమ్మ, శివారెడ్డిలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. విష యం తెలిసిన వెంటనే మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కోటమ్మకు భర్త ఇమ్మానియేల్‌తో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివారెడ్డికి భార్య సావిత్రితో పాటు కుమా ర్తె గాయత్రి, కుమారుడు నరసింహారెడ్డి ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పలకల ఫ్యాక్టరీకి చేరుకుని మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తులే చనిపోవడంతో తమకు దిక్కెవరంటూ విలపించారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేయడంతో ఫ్యాక్టరీ యజమాని తన వంతు సాయం అందిస్తానని చెప్పడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే సమీపంలో ఉన్న పలకల ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సంఘీభావం ప్రకటించారు. -
మట్టిపెళ్లలు పడి ఇద్దరు కూలీలు మృతి
-
డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి
కుత్బుల్లాపూర్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సెల్ ఓవెన్ శాక్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో డ్రైనేజీ సంప్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బెంగాల్ కు చెందిన అజయ్‌సింగ్(23), విజయ్‌సింగ్(30)లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలి కోసం వెళితే కరెంటు కాటేసింది
దారవరం(చాగల్లు) : విద్యుదాఘాతం వల్ల శనివారం ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం దారవరం శివారులో ఉన్న సూర్య రైస్‌మిల్లులో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది జట్టు కార్మికులు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం మిల్లులో పనికి వెళ్లిన కార్మికులు లారీలో నుంచి ధాన్యం బస్తాలను స్ట్రెగర్(క్రేన్) సాయంతో దిగుమతి చేశారు. తరువాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్ట్రెగర్‌ను రైస్‌మిల్లు గోదాములోకి తరలించేందుకు మిల్లు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపైకి తీసుకువస్తుండగా.. విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో కూలీలు స్ట్రెగర్‌ను కొంచెం కిందకి దించారు. ఈ సమయంలో 11కేవీ విద్యుత్ తీగలకు స్ట్రెగర్పైభాగం తగలడంతో దానిలోకి కరెంట్ ప్రసరించింది. దీంతో విద్యుదాఘాతానికి గురై తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన నున్నగొప్పుల శ్రీను(35), శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పున్నామి గ్రామానికి చెందిన పిన్నింటి రామకృష్ణ(38) మరణించారు. మీసాల సన్యాసినాయుడు, కొటికలపూడి వీరబాబు గాయపడ్డారు. క్షతగాత్రులు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో స్ట్రెగర్కు ఉన్న తాడు భాగం పట్టుకోవడంతో మిగిలిన కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ మాట్లాడుతూ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎస్సై ఎం.జయబాబు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండురోజుల్లో ఇంటికి వెళ్లిపోయేవాడు ప్రమాదంలో మృతి చెందిన శ్రీను మరో రెండు రోజుల్లో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయేవాడని అతని మేనమామ సోమరాజు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీను సొంతగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరంలో పనులు లేకపోవడంతో కుటుంబ పోషణకు వలస వచ్చాడు. స్థానిక రైస్‌మిల్లులో జట్టు పనులకు సుమారు 20 రోజుల క్రితం మరో పదిమందితో కలిసి వచ్చాడు. శ్రీనుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనాథలను చేసి వెళ్లిపోయాడు ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ భార్య ధనలక్ష్మి భర్త మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన ఇద్దరి అడపిల్లలను, తనను అనాథలను చేసి వెళ్లిపోయాడంటూ భోరున విలపించింది. కొద్దిసేపట్లో భోజనానికి వచ్చేవాడని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా నుంచి రెండేళ్ల క్రితం కుటుంబంతో సహా వలస వచ్చాడు. భార్యతో కలిసి రైస్‌మిల్లులో పనిచేస్తున్నాడు. -
ఇద్దరు కూలీల దుర్మరణం
కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల శివారు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం మండలంలోని పరడ గ్రామానికి చెందిన మాగి భిక్షం(60), కోనేటి యాదయ్య (55), సుంకరబోయిన వెంకన్నలు పామనగుండ్ల శివారులో రోజువారీగా కట్టెలు కొట్టేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామం పరడకు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై ముగ్గురు బయలుదేరారు. పామనగుండ్ల శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షం, యాదయ్యలు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన వెంకన్నను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. -
షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం