
తాగునీటి సమస్యను పరిష్కరించాలి: ఉత్తమ్
నేరేడుచర్ల: గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు, హుజుర్‌నగర్ ఎమ్మెల్యే కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన నేరేడుచర్ల మండలం గుడుగండ్లపాలెంలో నూతనంగా రూ. 1.30 కోట్లతో నిర్మించిన సీతారామాంజనేయ, పార్వతీ పరమేశ్వర, నవగ్రహ విగ్రహాలు, జీవధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు హాజరై మాట్లాడారు. శ్రీశైలం నుంచి వెంటనే సాగర్‌కు నీటిని విడుదల చేసి సాగర్ ద్వారా చెరువులు, కుంటలు నింపి తాగునీరు సమస్యను పరిష్కరించాలన్నారు.