హైదరాబాద్: హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా కేసీఆర్ సర్కార్ పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను పెండింగులో ఉంచటం దారుణమన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ ఆగస్టు 4న అసెంబ్లీ సెగ్మెంట్లలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో ఆగస్టు మూడోవారంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన ఉందని.. అందులో భాగంగా తొలిరోజు వరంగల్ లోని అంబేద్కర్ 155వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అదే రోజున భూపాలపల్లిలో రాహుల్ గాంధీ సింగరేణి కార్మికులతో భేటీ అవుతారని తెలిపారు. రెండో రోజు హైదరాబాద్ నగరంలో విద్యార్థులు, యువతతో రాహుల్ గాంధీ మాటామంతీ కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
పేదలను విస్మరిస్తోన్న కేసీఆర్ సర్కార్
Published Fri, Jul 31 2015 5:04 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement