దశాబ్దాలుగా వామపక్షాలకు కంచుకోటలా ఉన్న హుజుర్ నగర్ నేడు కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం జనాభా వ్యాపారాలు సాగించేవారితో పాటు, ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారితో రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్ నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడే, నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ కష్ట కాలంలోనూ పార్టీకి అనేక సేవలందించిన ఘనత సొంతం చేసుకున్నారు. అందుకేనేమో అధిష్టానం ప్రత్యేకంగా ఒక పదవిని సృష్టించి పీసీసీ చైర్మన్‌గా నియమించింది. ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేసిన ఆయన కీలకమైన నేటి తెలంగాణ ఎన్నికల్లో పార్టీ స్క్వాడ్రన్ లీడర్‌గా కాంగ్రెస్ విమానాన్ని నడుపుతున్నారు.
చదువు :
► బీఎస్సీ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) 1981,
► వెపన్స్ ఎంప్లాయిమెంట్ కోర్స్ (కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్) 1985
► భారత వాయు సేనలో మిగ్ 21 మరియు మిగ్ 23 యుద్ధ విమానాలను నడిపిన అనుభవం
►పాక్, చైనా సరిహద్దులుగా ఉన్న సియాచిన్ లాంటి కీలక ప్రాంతాల్లో పనిచేసి "గ్యాలంట్రీ" అవార్డు గ్రహిత
► 1990లో రాష్ట్రపతి సెక్యురిటీ వ్యవహారాలు చూసే ఏడీసీగా పనిచేయడం
రాజకీయ ప్రవేశం :
► 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత రాజకీయారంగేట్రం చేశారు.
► 1994లో కోదాడ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
► 1999లో కోదాడ నుంచే అతని విజయదుంధుబి మోగించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
► 1999 మరియు 2004ల్లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం,
►2009 లో భార్య పద్మావతిని కోదాడ నుంచి ఎన్నికల బరిలో దింపి తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
► 2009, 2014 ఇలా వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత
►2015 నుంచి తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు.
► శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ గా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా
పేరు : ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
తల్లి దండ్రులు : ఎన్ పురుషొత్తమ్ రెడ్డి, ఉషా దేవి
ఊరు : తాటిపాముల గ్రామం, తిరుమలగిరి మండలం, సూర్యపేట.
పుట్టినతేది : 20 జూన్ 1962 (వయస్సు : 56)
కుటుంబం : ఎన్ పద్మావతి (కోదాడ మాజీ ఎమ్మేల్యే)
చదువు : బీఎస్సీ పట్టా, మాజీ పైలట్
నటన : సినిమారంగం - టెర్రర్ సినిమాలో సీఎం పాత్ర పోషించారు. రియల్ టైం పొలిటిషియన్‌గా కనిపిస్తారు.
నచ్చిన మాట : "భారత దేశానికి యుద్ధం చేసిన నాకు భయమెందుకు..? 24 గంటలు నిస్వార్థంగా, నిజాయితీగా రాజకీయాలు చేసే నేను భయపడతానా!"
- జీ రేణుక
Comments
Please login to add a commentAdd a comment