హుజూర్‌నగర్ : సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హుజూర్‌నగర్ : రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ పతనం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి నివాసంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ను బొందపెట్టి గోరీ కట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని, రాష్ట్రంలో అధికారంలోకి రావడం వాస్తవమని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా హుజూర్‌నగర్‌ను తీర్చి దిద్దుతానని ఆ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు బండ్ల గణేష్, సాముల శివారెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, అట్లూరి హరిబాబు, తన్నీరు మల్లికార్జున్‌రావు, మంజీనాయక్, అమర్‌నాదరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మల్లయ్య, కోడి మల్లయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ అనాదిగా బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. అనంతరం ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాకూటమి నాయకులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, చావా కిరణ్మయి, అట్లూరి హరిబాబు, యరగాని నాగన్నగౌడ్, మల్లికార్జున్‌రావు, అమర్‌నారెడ్డి, మంజీ నాయక్, ప్రతాప్‌రెడ్డి, శంభిరెడ్డి, సుందరయ్య పాల్గొన్నారు.
రైతాంగం అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
మఠంపల్లి : తెలంగాణలో కోట్లాది మంది రైతాంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్ర³భుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండలంలోని బక్కమంతులగూడెం, చౌటపల్లిలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన సీనియ్‌ర్ నాయకులు తమ్మర శ్రీనివాసరెడ్డి, తిమ్మారెడ్డి, నర్సిరెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరగా ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతుల కోసం ఊరచెరువులు నింపేందుకు ఫీడర్ ఛానళ్లు, నూతనంగా ఎత్తిపోతల పథకాలను నిర్వహించనున్నామన్నారు.
యువతకు మెగా డీఎస్సీతో పాటు లక్ష ప్రభుత్వ ఉద్యోగా లను నియమించనున్నట్లు తెలిపారు. సమావేశంలో భూక్యా మంజీనాయక్, నలబోలు వెంకటరెడ్డి, సీతారాంరెడ్డి,అప్పయ్య, నిజాముద్దీన్, అరుణసైదులు, సోమయ్య, జహంగీర్, రాంరెడ్డి, యల్లారెడ్డి, గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment