సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకంలో తీవ్ర జాప్యం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది రైతులకు రైతు బంధు నిధులు అందలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆ రైతులకు రావాల్సిన నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కొరత వల్ల రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు యూరియాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment