కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు
గాంధీభవన్ మేడే వేడుకల్లో ఉత్తమ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తున్నాయని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మేడే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ శక్తులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నదని ఆరోపించారు. 70మందికి శ్రామికశక్తి అవార్డులిచ్చారు.
కాగా, గాంధీభవన్‌లో జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో ఉత్తమ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ దేశంలో దళితులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభు త్వాలు మాత్రమేనన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ పాల్గొన్నారు.