
అధిష్టానం చూసుకుంటుంది
యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రంగారెడ్డి సిలికాన్ వ్యాలీలా మారేదన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు కూడా లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉంటున్న సీఎం.. రాష్ట్రానికి ప్రాజెక్టు సాధించే విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు.
ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలసి సీబీఐ దర్యాప్తు వేయాల్సిందిగా కోరడానికి తాము ప్రయత్నించామన్నారు. కబ్జాదారుల నుంచి భూములు కోల్పోయిన రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.