ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిపై ఆదివారం ఆదిలాబాద్లో మండిపడ్డారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులు, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణలో యాత్ర చేస్తుంటే ... కిషన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు పని చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వి.హన్మంతరావు స్పష్టం చేశారు.