'అద్వానీ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాలి' | V Hanumantha rao responding on LK Advani comments | Sakshi
Sakshi News home page

'అద్వానీ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాలి'

Published Fri, Jun 19 2015 1:25 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

'అద్వానీ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాలి' - Sakshi

'అద్వానీ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాలి'

హైదరాబాద్: దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ చేసిన కామెంట్స్ సీరియస్గా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో వీహెచ్ మాట్లాడుతూ... దేశాన్ని పాలిస్తున్నది ఆర్ఎస్ఎస్ తప్ప నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. దేశంలో ముస్లింలను భయబ్రాంతులకు గురి చేసి మత సామరస్యాన్ని దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్ కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు చేశారని వీహెచ్ తెలిపారు. అవినీతి, బ్లాక్మనీ అంశాల్లో ఇరుకున్న లలిత్ మోదీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా కేంద్ర మంత్రి సుష్మా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని వీహెచ్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులంతా రాజీనామా చేసిన సంగతిని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement