కాకాకు అశ్రునివాళి
కరీంనగర్ సిటీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి భౌతికకాయానికి జిల్లా నేతలు నివాళి అర్పించారు. పార్టీకలతీతంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కులసంఘాల నాయకులు హైదరాబాద్‌లో జరిగిన కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాకా నివాసంలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ శ్రద్ధాంజలి ఘటించారు.
ఎంపీ బాల్క సుమన్ , ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, వొడితెల స తీష్‌బాబు, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, సి.ఆనందరావు, జి.రాజేశంగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్, బిరుదు రాజమల్లు, అల్గిరెడ్డి ప్రవీ ణ్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజ యం, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మర్రి వెంకటస్వా మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విజయరమణారావు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.వి.రామకృష్ణారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్క ర వేణుగోపాల్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నల్లాల కనకరాజ్, కాంగ్రెస్ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సిం హారావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్యాట రమేశ్, బాబర్ సలీం పాషా, పాడి కౌశిక్‌రెడ్డి, గజ్జెల కాంతం, కె.ఆనంద్‌యాదవ్, ఈర్ల కొమురయ్య, అర్ష మల్లేశం, న్యాత శ్రీనివాస్, కేడం లింగమూర్తి, ఆకుల వెం కట్ తదితరులు వెంకటస్వామి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
‘కాకా’ మృతి తీరని లోటు
కరీంనగర్ : కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి మృతి పార్టీతోపాటు దేశానికి, దళిత, బడుగు, బలహీనవర్గాలకు తీరని లోటు అని ప లువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీ య జెండాను అవనతం చేసి రెండునిమిషాలు మౌనం పాటించారు.
కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.స్వామినాథాచార్యులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, నా యకులు గోపాల్‌కిషన్‌రావు, రాజమల్లయ్య, న్యాత శ్రీనివాస్, బాకారపు శివయ్య, కల్వల రాంచందర్, కుమారయాదవ్, ముస్తాక్, మాదా సు శ్రీనివాస్, జైపాల్, ప్రశాంత్, దీపక్, బోబ్బి లి విక్టర్, రాజేశం, పాపయ్య, వేదం, సతీష్‌రావు, సర్దూల్‌సింగ్, ఇలియాస్, రాములు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.