district leaders
-
ఆశలు గల్లంతు!
► జిల్లాకు దక్కని రెండో మంత్రి పదవి ► మంత్రివర్గ విస్తరణలోప్రకాశానికి మొండిచేయి ► ఒకే ఒక్కడు శిద్దా రాఘవరావు ► మాగుంటకు మొండిచేయి ► ఫలించని దామచర్ల, డేవిడ్‌రాజుల ప్రయత్నాలు ► డీలా పడిన ఆశావహులు ► ఇన్చార్జి మంత్రి రావెలపై వేటు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాజా మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాకు మొండిచేయి చూపారు. సమీకరణలు, కూడికలు.. తీసివేతల తర్వాత ఇన్నాళ్లూ జిల్లాను ఊరిస్తూ వచ్చిన రెండో మంత్రి పదవి చివరి నిమిషంలో చేజారి పోయింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ముఖ్యంగా పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తీవ్రంగా ప్రయత్నించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు అమాత్య పదవికోసం తనవంతు ప్రయత్నాలు సాగించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు చివరికు నిరాశ మిగిలింది. దీంతో వారి వర్గీయులు డీలా పడ్డారు. జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోడంతో పార్టీ శ్రేణులు ఉసూరుమన్నారు. జిల్లా నుంచి మంత్రి శిద్దా రాఘవరావు కేబినెట్లో ఏక్ నిరంజన్‌గా మిగిలారు. ఫలించని ప్రయత్నాలు..: ప్రకాశం జిల్లాకు తాజా విస్తరణలో రెండో మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావించారు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రాగానే ప్రకాశం జిల్లాకు మంత్రి పదవిపై ఊహాగానాలు అధికమయ్యాయి. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల తన సమీప బంధువైన కేంద్రమంత్రి ద్వారా మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతును సైతం కూడా గట్టి ఆయన గట్టి ప్రయత్నమే చేసినట్లు సమాచారం. మరోవైపు యర్రగొండుపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు కూడా ఎస్సీ కోటాలో మంత్రి పదవి చేజిక్కి తనవంతు ప్రయత్నాలు సాగించారు. చివరి నిమిషంలో బాబు వీరందరి ఆశల్ని గల్లంతు చేశారు. మాగుంట వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి..: ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు వచ్చినప్పటికీ కుల సమీకరణల్లో భాగంగా చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో అదే జిల్లాకు చెందిన మాగుంటకు పదవి దక్కలేదు. ఒక దశలో సోమిరెడ్డికి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టి మాగుంటకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత మాగుంటకు మండలి చైర్మన్ పదవి ఇచ్చి సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారన్న వార్తలు వెలువడ్డాయి. చంద్రబాబు సోమిరెడ్డి వైపే మొగ్గు చూపడంతో మాగుంట ఆశలకు గండి పడింది. దీంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. అడగక పోయినా పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసిన అధిష్టానం చివరి నిమిషంలో మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనుకూలించని కుల సమీకణలు..: ఇక దామచర్ల గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి వద్దకు తన అనుచరులు వెళ్లి తనకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. సమీకరణలు అనుకూలించక పోవడంతో తన సామాజికవర్గానికి చెందిన దామచర్లకు పదవి ఇచ్చేందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సామాజికవర్గం నుంచి రిజర్వుడు కోటాలో పోటీ ఎక్కువ ఉండడంతో ఆయన ఆశలూ ఫలించలేదు. ఒకే ఒక్కడు శిద్దా..: జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వక పోవడంతో ప్రస్తుత మంత్రి శిద్దా రాఘవరావు జిల్లాకు ఒకేఒక్క మంత్రిగా మిగిలారు. ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న రవాణాశాఖ లేదా రోడ్ల భవనాలశాఖల్లో ఒక దానిని తప్పించి మరో శాఖ అప్పగించనున్నట్లు సమాచారం. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు ఉద్వాసన...: ఎట్టకేలకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడింది. రావెల పనితీరు పట్ల చాలా కాలంగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం ఉంది. తాజా విస్తరణలో రావెలను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా జరిగింది. అనుకున్నట్టే చివరకు సీఎం ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు. -
జిల్లా నేతలపై టీడీపీ రహస్య సర్వే
-
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలోకి జిల్లా నేతలు
రాష్ట్ర కార్యదర్శులుగా ఆరుగురు.. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఐదుగురి నియామకం ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి 11 మంది నేతలకు పదవులు వరించాయి. ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా, మరో ఐదుగురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శులుగా మందడపు వెంకట్రామ్రెడ్డి, ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి సైదులు, కొల్లు వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమాటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పుల్లి సైదులు, కుర్సమ్ సత్యనారాయణను నియమించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ.. రాష్ట్ర కమిటీలోకి జిల్లా నేతలను తీసుకోవడంతో మొదలు పెట్టింది. త్వరలోనే జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలను ప్రకటించి.. ప్రజా ఉద్యమంలోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ వీడినంత మాత్రాన ప్రజల్లో వైఎస్సార్ సీపీ, వైఎస్ మీద అభిమానం ఉందని.. ఈ మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వం కొత్తగా నియమితులైన వారికి సూచించింది. జిల్లా కమిటీ ప్రకటించిన వెంటనే ప్రజా పోరాటాలపై ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లాని రాష్ట్ర పార్టీ.. జిల్లా నేతలకు చెప్పింది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలు మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పడతామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఒక్కో పథకాన్ని పక్కనపెట్టి.. నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పథకాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. -
కాకాకు అశ్రునివాళి
కరీంనగర్ సిటీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి భౌతికకాయానికి జిల్లా నేతలు నివాళి అర్పించారు. పార్టీకలతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కులసంఘాల నాయకులు హైదరాబాద్‌లో జరిగిన కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాకా నివాసంలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీ బాల్క సుమన్ , ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, వొడితెల స తీష్బాబు, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, సి.ఆనందరావు, జి.రాజేశంగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్, బిరుదు రాజమల్లు, అల్గిరెడ్డి ప్రవీ ణ్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజ యం, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మర్రి వెంకటస్వా మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విజయరమణారావు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.వి.రామకృష్ణారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్క ర వేణుగోపాల్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నల్లాల కనకరాజ్, కాంగ్రెస్ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సిం హారావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్యాట రమేశ్, బాబర్ సలీం పాషా, పాడి కౌశిక్‌రెడ్డి, గజ్జెల కాంతం, కె.ఆనంద్‌యాదవ్, ఈర్ల కొమురయ్య, అర్ష మల్లేశం, న్యాత శ్రీనివాస్, కేడం లింగమూర్తి, ఆకుల వెం కట్ తదితరులు వెంకటస్వామి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘కాకా’ మృతి తీరని లోటు కరీంనగర్ : కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి మృతి పార్టీతోపాటు దేశానికి, దళిత, బడుగు, బలహీనవర్గాలకు తీరని లోటు అని ప లువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీ య జెండాను అవనతం చేసి రెండునిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.స్వామినాథాచార్యులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, నా యకులు గోపాల్‌కిషన్‌రావు, రాజమల్లయ్య, న్యాత శ్రీనివాస్, బాకారపు శివయ్య, కల్వల రాంచందర్, కుమారయాదవ్, ముస్తాక్, మాదా సు శ్రీనివాస్, జైపాల్, ప్రశాంత్, దీపక్, బోబ్బి లి విక్టర్, రాజేశం, పాపయ్య, వేదం, సతీష్‌రావు, సర్దూల్సింగ్, ఇలియాస్, రాములు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలు
►సీజీసీ సభ్యులుగా పాలవలస, ధర్మాన ►పార్టీ అధికార ప్రతినిధులుగా ధర్మాన, తమ్మినేని ►కార్యదర్శిగా పిరియా సాయిరాజ్ ►పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రకటన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి కీలక కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించింది. శుక్రవారం పార్టీ జరిపిన పలు కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం ఈ కమిటీల వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది. వీటిలో జిల్లా నుంచి నలుగురు నేతలకు చోటు లభించింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు, జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు పాలవలస రాజశేఖరం పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా నియమితులయ్యారు. ధర్మాన ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పార్టీ అధికార ప్రతినిధులుగా ధర్మాన ప్రసాదరావుతోపాటు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నియమించారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ను పార్టీ కార్యదర్శి పదవి వరించింది. పార్టీ ప్రధాన కమిటీల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా నేతలకు చోటు దక్కడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. -
రూ.100 కోట్లు ఏమూలకు?
సాక్షి, అనంతపురం : అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేసి ‘అనంత’ ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా మంత్రులు పల్లె, పరిటాల సునీతలు సమావేశాల్లో ఊదరగొడుతున్నా ఈ పథకాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోట్లాది రూపాయలు ఈ పథకం కోసం వెచ్చించి పనులను చకచకా చేయించారు. అప్పట్లోనే మొదటి, రెండో దశ పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగాయి. వైఎస్ మరణానంతరం సీఎంగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో బొటాబోటి నిధులు విడుదల చేసి చివరకు మొదటి దశ పనులను 90 శాతం వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కేటాయింపు రూ.100 కోట్లు మొదటి దశ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రూ.350 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఆ మేరకైనా నిధులు విడుదల చేస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నిండింది. ఎక్కువైన నీటిని దిగువ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం 2 టీఎంసీలకు మాత్రమే జీవో తీసుకొచ్చి ఈ మేరకు నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆగస్టు 2న విడుదల చేయించారు. గత ఏడాది 9 టీఎంసీల దాకా ప్రభుత్వం నీటిని తీసుకువచ్చింది. తుంగభద్ర జలాశయం నుంచి రావాల్సిన నీటి కోటాలో కూడా గండి పడుతుండగా, హంద్రీ-నీవా నీటిని తీసుకురావడంలో వైఫల్యం కనిపిస్తోంది. శ్రీశైలం నుంచి రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించినా నీటి ఆవిరి, జల చౌర్యం, పూడిక తదితర కారణాలతో జీడిపల్లి రిజర్వాయర్‌కు ఒకటిన్నర టీఎంసీకి మించి వచ్చే అవకాశం లేదు. 565 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్ రాయలసీమలోని నాలుగు జిల్లాలకు హంద్రీ-నీవా పథకం ద్వారా 6 లక్షల 25 వేల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని 40 టీఎంసీల సామర్థ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. 565 కిలోమీటర్ల పొడవుతో మెయిన్ (హంద్రీ నుంచి నీవా వరకు) కెనాల్‌ను రూపొందించారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు 120 రోజులు శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ప్రవాహం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా నీటి విడుదల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో జనవరి వరకు వరద ఉండడంతో జనవరి వరకు నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌కు తీసుకువచ్చింది. ఏవీఆర్ హంద్రీ-నీవా పథకం మొదటి, రెండో దశల్లో కలుపుకుని కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3.45 లక్షలు, వైఎస్ఆర్ జిల్లాలో 35,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.45 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు మొత్తం రూ.6,850 కోట్లతో అంచనా వేయగా.. ధరలు, ఖర్చులు పెరగడంతో మొదటి దశ రూ.2,774 కోట్లు, రెం డో దశకు రూ.4,976 కోట్లుతో మొత్తంగా రూ.7,750 కోట్లు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మేరకు నిధులు ఖర్చు పెడుతారో? గత ప్రభుత్వం పాలన చివర్లో ఎత్తిపోతల పథకానికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ..పనుల పురోగతికి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు మొదటి దశ పనులు పూర్తి చేయడానికి రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మొదటి దశలో రోడ్డు క్రాసింగ్‌లు, రైలు బ్రిడ్జి క్రాసింగ్‌లు, అటవీ శాఖ అనుమతులు చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లతో జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకువచ్చింది. మొదటి దశ, రెండో దశలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. దీంతో పాటు ఉప కాలువలను పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2014-15కు రెండో దశ పనుల్లో భాగంగా కదిరి సమీపంలోని గొల్లపల్లి, బుక్కపట్నం మండల సమీపంలోని మారాల రిజర్వాయర్లు పూర్తి చేసి వాటి ద్వారా చెరువులకు నీరు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం రూ.450 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. 2015-16 నాటికి ఫేజ్-2 కెనాల్‌ను మారాల రిజర్వాయర్ నుంచి అడవిపల్లి రిజర్వాయర్ వరకు పూర్తి చేసి నీటిని ఇవ్వాలని లక్ష్యంగా రూ.400 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2016-17 నాటికి హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయడమే కాకుండా మడకశిర, తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు నీవా బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ హంద్రీ-నీవాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నీరందిస్తామని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ‘అనంత’పై వరాలు కురిపించారు. రుణ మాఫీకే డబ్బులు లేక జుట్టు పీక్కుంటున్న ప్రభుత్వం చాంతాడంత జాబితాలో పేర్కొన్న హామీలకు నిధుల సంగతేంటని అనంత వాసులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో హంద్రీ-నీవాకు ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు సరిపోతాయని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు ముఖ్య పదవులు లభించాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా చిన వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మేరుగ నాగార్జున, ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి బాధ్యతలతోపాటు ప్రకాశం జిల్లా వ్యవహారాలను, మోపిదేవి వెంకట రమణ కృష్ణా, గుంటూరు జిల్లాలు.. జంగా కృష్ణమూర్తి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పార్టీ వ్యవహారాలను చూస్తారు. ఇదిలా ఉండగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి నియమితులయ్యారు. -
నేదునూరుకు మొండిచేయి
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లుకు జిల్లా నేతలు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర మంత్రిమండలి తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటే జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో బిల్లుపై చర్చ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు సవరణలు ప్రతిపాదించారు. ఇందులో కరీంనగర్లో టెక్స్టైల్ పార్క్, నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం ప్రధానమయినవి. ఈ రెండు సవరణలనూ కేంద్రం ఆమోదించకపోవడం జిల్లా ప్రజలను అసంతృప్తికి గురిచేసింది. నేదునూరు వద్ద గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందనుకుంటే నిరాశే ఎదురయ్యింది. ఏడే ళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూ.9వేల కోట్ల అంచనా వ్యయంతో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత ప్రాజెక్టును మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య నేదునూరు పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. తొలిదశలో 700 మెగావాట్ల విద్యు త్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. ప్రాజెక్టు ఏర్పాటు కోసం 432 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రైతులకు రూ.13.55 లక్షలు పరిహారంగా చెల్లించారు. రూ.5కోట్లు ఖర్చు చేసి రోశయ్య వేసిన శిలాఫలకాన్ని కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు జరగలేదు. గ్యాస్ కేటాయింపులు సాధిస్తామని జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పొ న్నం ప్రభాకర్, వివేకానంద, మధుయాష్కీ ఇ చ్చిన హామీలు అమలుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన పాపానపోలేదు. శంకుస్థాపన చేసినా ప్రాజెక్టు లో పురోగతి లేకపోవడంతో అన్ని రాజకీయ ప క్షాలనుంచి ఆందోళన వ్యక్తమయ్యింది. విద్యుత్ కేంద్రం పేరిట ప్రభుత్వం జిల్లా ప్రజల చెవు ల్లో పూలు పెడుతోందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ చెవి లో పూలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిం చిం ది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఫెన్సిం గ్‌కు వేసి తాళాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. గత ఫిబ్రవరి 14న సీపీఐ కార్యకర్త లు పిండప్రదానం చేశారు. ఎన్నికల హామీగా మిగి లిన ఈ ప్రాజెక్టు ఇలాగయినా కార్యరూపంలోకి వస్తుందనుకుంటే ఈసారీ నిరాశే ఎదురయ్యింది. నేత పరిశ్రమకు నిలయమైన కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నా యి. నేత పరిశ్రమను ఆదుకుని కార్మికులకు మె రుగయిన ఉపాధి కల్పించాలని అనేక సంవత్సరాలు డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు సిరిసిల్లలో నేత పరిశ్రమను ఆదుకునే దిశగా తీసుకు న్న చర్యలేవీ ఆత్మహత్యలను నివారించలేకపోయాయి. నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ప్ర యోజనం కలిగేందుకు జిల్లాలో టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిని సైతం కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. -
తెలుగుతమ్ముళ్లకు చెక్
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని జిల్లా నాయకులు రుజువు చేస్తున్నారు. మారుతున్న సమీకరణల నేపధ్యంలో పార్టీలు మారేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత తీరు కన్పిస్తోంది. ఇంతకాలం పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన కేడర్‌ను సైతం విస్మరించేందుకు సమాయత్తమవుతున్నారు. బలవంతుడు అన్పిస్తే ఉన్న వాళ్లను పక్కకు తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేతోబాటు ఇతర నేతలను పార్టీలోకి తెచ్చుకునే క్రమంలో తెలుగు తమ్ముళ్ల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టనున్నారు. రాబోవు ఎన్నికలను చావో, రేవో అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించేందుకు వెనుకాడటం లేదు. పెపైచ్చు బద్ధ విరోధులను కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన అంశం రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తోంది. వైరి వర్గాలను ఏకం చేస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే దిశగా టీడీపీ పావులు కదుపుతోంది. అందుకోసం అవసరమైతే కేడర్‌ను విస్మరించేందుకు వెనుకంజ వేయడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలోని మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప నియోజకవర్గాలల్లో పెనుమార్పులు తలెత్తనున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రశ్నార్థకంగా ‘పుట్టా’ భవితవ్యం మారుతున్న సమీకరణల నేపధ్యంలో మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ టికెట్ కోసం సీనియర్ ఎమ్మెల్యే ఒకరు దృష్టి సారించి, ఆమేరకు సఫలీకృతుడైనట్లు తెలుస్తోంది. ఈవిషయం హైదరాబాద్ నుంచి మైదుకూరు దాకా పాకింది. పార్టీ కోసం డబ్బును మంచినీళ్లు లెక్కన ఖర్చు చేస్తున్న పుట్టాకు జరుగుతున్న పరిణామాలు మింగుడుపడటం లేదు. అనూహ్యంగా తెరపైకి అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు వచ్చినట్లు టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం స్థాయిలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు సుధాకర్‌యాదవ్ వియ్యంకుడు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుని సైతం ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అభ్యర్థికంటే గెలుపే ముఖ్యమన్న రీతిలో అధినేత వ్యవహరిస్తున్నారని, అందుకోసం ఎవరి పరిధిలో వారు ఎంతోకొంత త్యాగాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కృషి చేస్తున్న వారిని కాదని, మరెవరికో టికెట్ కేటాయిస్తామని పేర్కోనడం సబబు కాదని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ప్రొద్దుటూరు, రాయచోటిలపై ఓ ఎంపీ ప్రత్యేక దృష్టి... అధినేత మనసెరిగిన ఓనేత ప్రొద్దుటూరు, రాయచోటి నిమోజవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆమేరకు తనదైన శైలిలో పావులు కదుపుతూ సరికొత్త సమీకరణలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా లింగారెడ్డి ఉన్నప్పటికీ, అభ్యర్థి మార్పు లాభదాయకమని అధినేత చెవులు కొరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం అటు జమ్మలమడుగు, ఇటు కమలాపురం నియోజకవర్గాలకు కూడా లాభిస్తుందని ఓ మాజీ ఎమ్మెల్యే బంధుత్వ వివరాలను విశదపర్చినట్లు సమాచారం. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తమ సూచనను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఎత్తుగడలకు చెక్ పెడుతూ మరో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం ఆనేతపై పీడీ యాక్టు పెట్టాలని భావిస్తే విశ్వప్రయత్నం చేసి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తన పాత్ర నామమాత్రం కాకుండా ఉండేందుకు పలు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. అందుకోసం కేడర్‌ను బలి చేసేందుకు కూడా వెనుకంజ వేయడం లేదని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆపార్టీ పక్క నియోజకవర్గ నేతతోబాటు, ఇతర నేతలు కూడా కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేకపోవడం కూడా క డప నేతల నిరాసక్తతకు కారణంగా కనబడుతోంది. ఇక్కడి వారంతా చేతగాని వారుగా చిత్రీక రించి ఆటికెట్ను ఎగరేసుకెళ్లాలనే దిశగా ఆపార్టీ నేత చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధినేత వైఖరి కారణంగా తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. -
చేతులెత్తేసిన అటవీశాఖ
సాక్షి, నిజామాబాద్: విధినిర్వహణలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శని, ఆది వారాల్లో కోర్టులో హాజరు పర్చే అవకా శాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబం ధించి సుమారు 30మందిపై కేసులు నమోదు చేసి, 22మందిని అరెస్టు చేశా రు. వీరిలో సీపీఎంకు చెందిన జిల్లా నేతలు భాస్కర్, వెంకట్రాములు తది తరులు ఉన్నారు. హత్యకేసులో వారి ప్రమేయం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు 20మంది సభ్యులతో ఐదు బృందాలను నియమించారు. గంగయ్య హత్యకేసులో పోలీసులు ముందుకు కదులుతున్నా సొంతశాఖ మాత్రం అంతంత మాత్రమే స్పందిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖాధికారులు ఈ కేసుకు సంబంధించిన భారమంతా పోలీసులపైనే వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిందితులపై ఐపీసీ 147, 148, 353, 332, 302, 307, 120బీ, 149, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్, యూఏపీఏ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఆర్ఓ హత్యకేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కే.వీ.మోహన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ కేసులో అటవీభూమిని దున్నిన ట్రాక్టర్లను, గొడ్డళ్లను, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. అంత అవసరం ఏమొచ్చింది.. తన భర్తను అర్ధరాత్రి వేళ ఎలాంటి పోలీసుల సహాయం లేకుండా అటవీ ప్రాంతానికి పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని గంగయ్య భార్య హేమలత మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తంచేశారు. రాతపూర్వకంగా తమకు ఫిర్యాదు అందితే ఆ దిశగా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరెస్టు చేసిన నిందితులను శని, ఆదివారాల్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయి. చేతులెత్తేసిన సొంతశాఖ తమ శాఖ అధికారి గంగయ్య హత్య ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో అటవీశాఖ పూర్తిగా చేతులెత్తేసిందనే విమర్శలున్నాయి. కేసుల నమోదు, నిందితుల అరెస్టు వంటి భారమంతా పోలీసుశాఖపైనే నెట్టేసి చేతులు దులుపుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వుఫారెస్టు భూముల ఆక్రమణపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసే అధికారం అటవీశాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గంగయ్య హత్య వెనుక ఆయన భార్య హేమలత చేస్తున్న ఆరోపణలనూ అటవీశాఖ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. తన భర్త హత్య వెనుక అనుమానాలున్నాయంటున్నా స్పందించకపోవడం గమనార్హం. కనీసం శాఖాపరమైన విచారణకు కూడా అటవీశాఖ అధికారులు ఆదేశించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. రాతపూర్వక ఫిర్యాదు అందితే శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తామని నిజామాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు గోపీనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తమ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసులు నమోదు చేస్తుందన్నారు. అన్నికోణాల్లో విచారణ జరపాలి.. -గౌతంకుమార్, గంగయ్య సమీప బంధువు గంగయ్య హత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపించాలి. ఇందులో ప్రమేయం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు గంగయ్య సెల్‌ఫోన్ దొరకలేదు. ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితులను పట్టుకోవాలి. అటవీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు గంగయ్య కుటుం బాన్ని కనీసం పరామర్శించలేదు.