సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లుకు జిల్లా నేతలు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర మంత్రిమండలి తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటే జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో బిల్లుపై చర్చ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు సవరణలు ప్రతిపాదించారు. ఇందులో కరీంనగర్‌లో టెక్స్‌టైల్ పార్క్, నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం ప్రధానమయినవి. ఈ రెండు సవరణలనూ కేంద్రం ఆమోదించకపోవడం జిల్లా ప్రజలను అసంతృప్తికి గురిచేసింది.
నేదునూరు వద్ద గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందనుకుంటే నిరాశే ఎదురయ్యింది. ఏడే ళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూ.9వేల కోట్ల అంచనా వ్యయంతో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత ప్రాజెక్టును మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య నేదునూరు పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
తొలిదశలో 700 మెగావాట్ల విద్యు త్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. ప్రాజెక్టు ఏర్పాటు కోసం 432 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రైతులకు రూ.13.55 లక్షలు పరిహారంగా చెల్లించారు. రూ.5కోట్లు ఖర్చు చేసి రోశయ్య వేసిన శిలాఫలకాన్ని కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు జరగలేదు. గ్యాస్ కేటాయింపులు సాధిస్తామని జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పొ న్నం ప్రభాకర్, వివేకానంద, మధుయాష్కీ ఇ చ్చిన హామీలు అమలుకాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన పాపానపోలేదు. శంకుస్థాపన చేసినా ప్రాజెక్టు లో పురోగతి లేకపోవడంతో అన్ని రాజకీయ ప క్షాలనుంచి ఆందోళన వ్యక్తమయ్యింది. విద్యుత్ కేంద్రం పేరిట ప్రభుత్వం జిల్లా ప్రజల చెవు ల్లో పూలు పెడుతోందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ చెవి లో పూలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిం చిం ది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఫెన్సిం గ్‌కు వేసి తాళాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. గత ఫిబ్రవరి 14న సీపీఐ కార్యకర్త లు పిండప్రదానం చేశారు. ఎన్నికల హామీగా మిగి లిన ఈ ప్రాజెక్టు ఇలాగయినా కార్యరూపంలోకి వస్తుందనుకుంటే ఈసారీ నిరాశే ఎదురయ్యింది.
నేత పరిశ్రమకు నిలయమైన కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నా యి. నేత పరిశ్రమను ఆదుకుని కార్మికులకు మె రుగయిన ఉపాధి కల్పించాలని అనేక సంవత్సరాలు డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు సిరిసిల్లలో నేత పరిశ్రమను ఆదుకునే దిశగా తీసుకు న్న చర్యలేవీ ఆత్మహత్యలను నివారించలేకపోయాయి. నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ప్ర యోజనం కలిగేందుకు జిల్లాలో టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిని సైతం కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.
నేదునూరుకు మొండిచేయి
Published Sun, Feb 9 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement