సాక్షి, నిజామాబాద్: విధినిర్వహణలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శని, ఆది వారాల్లో కోర్టులో హాజరు పర్చే అవకా శాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబం ధించి సుమారు 30మందిపై కేసులు నమోదు చేసి, 22మందిని అరెస్టు చేశా రు. వీరిలో సీపీఎంకు చెందిన జిల్లా నేతలు భాస్కర్, వెంకట్రాములు తది తరులు ఉన్నారు. హత్యకేసులో వారి ప్రమేయం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు 20మంది సభ్యులతో ఐదు బృందాలను నియమించారు.
గంగయ్య హత్యకేసులో పోలీసులు ముందుకు కదులుతున్నా సొంతశాఖ మాత్రం అంతంత మాత్రమే స్పందిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖాధికారులు ఈ కేసుకు సంబంధించిన భారమంతా పోలీసులపైనే వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిందితులపై ఐపీసీ 147, 148, 353, 332, 302, 307, 120బీ, 149, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్, యూఏపీఏ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఎఫ్‌ఆర్‌ఓ హత్యకేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కే.వీ.మోహన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ కేసులో అటవీభూమిని దున్నిన ట్రాక్టర్లను, గొడ్డళ్లను, కర్రలను స్వాధీనం చేసుకున్నారు.
అంత అవసరం ఏమొచ్చింది..
తన భర్తను అర్ధరాత్రి వేళ ఎలాంటి పోలీసుల సహాయం లేకుండా అటవీ ప్రాంతానికి పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని గంగయ్య భార్య హేమలత మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తంచేశారు. రాతపూర్వకంగా తమకు ఫిర్యాదు అందితే ఆ దిశగా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరెస్టు చేసిన నిందితులను శని, ఆదివారాల్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయి.
చేతులెత్తేసిన సొంతశాఖ
తమ శాఖ అధికారి గంగయ్య హత్య ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో అటవీశాఖ పూర్తిగా చేతులెత్తేసిందనే విమర్శలున్నాయి. కేసుల నమోదు, నిందితుల అరెస్టు వంటి భారమంతా పోలీసుశాఖపైనే నెట్టేసి చేతులు దులుపుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వుఫారెస్టు భూముల ఆక్రమణపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసే అధికారం అటవీశాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గంగయ్య హత్య వెనుక ఆయన భార్య హేమలత చేస్తున్న ఆరోపణలనూ అటవీశాఖ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. తన భర్త హత్య వెనుక అనుమానాలున్నాయంటున్నా స్పందించకపోవడం గమనార్హం. కనీసం శాఖాపరమైన విచారణకు కూడా అటవీశాఖ అధికారులు ఆదేశించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. రాతపూర్వక ఫిర్యాదు అందితే శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తామని నిజామాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు గోపీనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తమ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేసులు నమోదు చేస్తుందన్నారు.
అన్నికోణాల్లో విచారణ జరపాలి..
-గౌతంకుమార్, గంగయ్య సమీప బంధువు
గంగయ్య హత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపించాలి. ఇందులో ప్రమేయం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు గంగయ్య సెల్‌ఫోన్ దొరకలేదు. ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితులను పట్టుకోవాలి. అటవీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు గంగయ్య కుటుం బాన్ని కనీసం పరామర్శించలేదు.
చేతులెత్తేసిన అటవీశాఖ
Published Sat, Sep 21 2013 4:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement