venkatswamy
-
విలేకరిపై దాడి
అమడగూరు : ఓ పత్రికలో పనిచేస్తున్న రెడ్డివారిపల్లికి చెందిన విలేకరి వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన పలువురు గురువారం రాత్రి దాడికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన కొన్ని పరిణామాల వలన గ్రామానికి చెందిన ఆరుగురు ఉన్నఫలంగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. దాడిలో గాయపడిన వెంకటస్వామికి ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని తోటి విలేకరులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శేషురెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు. -
కాకాకు అశ్రునివాళి
కరీంనగర్ సిటీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి భౌతికకాయానికి జిల్లా నేతలు నివాళి అర్పించారు. పార్టీకలతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కులసంఘాల నాయకులు హైదరాబాద్‌లో జరిగిన కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాకా నివాసంలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీ బాల్క సుమన్ , ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, వొడితెల స తీష్బాబు, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, సి.ఆనందరావు, జి.రాజేశంగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్, బిరుదు రాజమల్లు, అల్గిరెడ్డి ప్రవీ ణ్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజ యం, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మర్రి వెంకటస్వా మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విజయరమణారావు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.వి.రామకృష్ణారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్క ర వేణుగోపాల్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నల్లాల కనకరాజ్, కాంగ్రెస్ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సిం హారావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్యాట రమేశ్, బాబర్ సలీం పాషా, పాడి కౌశిక్‌రెడ్డి, గజ్జెల కాంతం, కె.ఆనంద్‌యాదవ్, ఈర్ల కొమురయ్య, అర్ష మల్లేశం, న్యాత శ్రీనివాస్, కేడం లింగమూర్తి, ఆకుల వెం కట్ తదితరులు వెంకటస్వామి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘కాకా’ మృతి తీరని లోటు కరీంనగర్ : కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి మృతి పార్టీతోపాటు దేశానికి, దళిత, బడుగు, బలహీనవర్గాలకు తీరని లోటు అని ప లువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీ య జెండాను అవనతం చేసి రెండునిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.స్వామినాథాచార్యులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, నా యకులు గోపాల్‌కిషన్‌రావు, రాజమల్లయ్య, న్యాత శ్రీనివాస్, బాకారపు శివయ్య, కల్వల రాంచందర్, కుమారయాదవ్, ముస్తాక్, మాదా సు శ్రీనివాస్, జైపాల్, ప్రశాంత్, దీపక్, బోబ్బి లి విక్టర్, రాజేశం, పాపయ్య, వేదం, సతీష్‌రావు, సర్దూల్సింగ్, ఇలియాస్, రాములు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుత్తి మునిసిపాలిటీలో హై డ్రామా
గుత్తి : అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గుత్తి మునిసిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీకి అవకాశం ఉన్నా.. తెలుగుదేశం పార్టీ ఒక స్వతంత్ర అభ్యర్థిని బలవంతంగా తమవైపు తిప్పుకోవడంతోపాటు ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు ద్వారా ఒక్క ఓటు మెజార్టీతో విజయం పొందింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల అధికారి (పీఓ) వెంకటస్వామి, కమిషనర్ ఇబ్రహీం కౌన్సిల్‌హాలులో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సరిగ్గా పదిన్నర గంటలకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే జింతేందర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొట్రికె శ్రీహరిగుప్తా, మాజీ ఎంపీపీ కోనా మురళీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు వెంకటశివుడు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ర్ట నాయకుడు దిల్కా శీనా టీడీపీ కౌన్సిలర్లు ఎనిమిదిమందితోపాటు ఇండిపెండెంట్లు సరస్వతి, సురేష్బాబులను తోలుకొని కార్యాలయంలోకి అడుగుపెట్టారు. మునిసిపల్ సిబ్బందిని కమిషనర్ చేత బయటికి పంపించివేశారు. 10.45 గంటలకు వైఎస్సార్ సీపీ నియోజవర్గ నేత వై.వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా, గుత్తి మాజీ సర్పంచు పీరా, నాయకులు సుంకం రఫీ, న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి తదితరులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు 10 మందితో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు రమేష్‌బాబు, వెంకటేష్, లక్ష్మీదేవిలతో కలిసి భారీ బందోబస్తు మధ్య వచ్చారు. అయితే తలుపుల వద్దే కూర్చున్న జేసీ, కొట్రికె శ్రీహరి అమాంతంగా రమేష్‌బాబును లాక్కుని తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహించి టీడీపీ నేతలతో గొడవకు దిగారు. సీఐ మోహన్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డితో పాటు బీఎస్ఎఫ్ పోలీసులు ఎంత ప్రయత్నించినా సద్దుమణగలేదు. చివరకు లాఠీచార్జ చేయడంతో గంటపాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌన్సిల్ హాలులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. స్వతంత్ర కౌన్సిలర్ రమేష్‌బాబు తనకు కేటాయించిన స్థానంలో కాకుండా జేసీ పక్కన కూర్చోవడంపై వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి కమలాక్షమ్మ అభ్యంతరం తెలపడంతో మామాటా పెరిగింది. చివరకు పీఓ జోక్యం చేసుకుని రమేష్‌బాబును మరో చోట కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ తరపున చైర్‌పర్సన్‌గా కమలాక్షమ్మను కౌన్సిలర్లు నజీర్, వరలక్ష్మిలు ప్రతిపాదించి బలపరిచారు. టీడీపీ తరఫున తులసమ్మను కౌన్సిలర్లు రమేష్‌బాబు, గోవిందు ప్రతిపాదించి బలపరిచారు. మొత్తం 24 మంది సభ్యులకు గాను వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థికి ఆ పార్టీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు, ఇద్దరు స్వతంత్రులు (వెంకటేష్, లక్ష్మిదేవి)తో కలిసి చేతులెత్తగా 12 మంది అయ్యారు. వైఎస్సార్సీపీ 21వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి గైర్హాజరయ్యారు. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి తులసమ్మకు అనుకూలంగా టీడీపీ కౌన్సిలర్లు 8 మంది, ముగ్గురు స్వతంత్రులతోపాటు ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు (ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్) చేతులెత్తడం తో 13 మంది అయ్యారు. వైస్ చైర్మన్ స్థానానికి టీడీపీ కౌన్సిలర్ ఆర్.బి.పురుషోత్తంకు కూడా 13 మంది అనుకూలంగా చేతులెత్తారు. దీంతో ఒక్క ఓటు తేడాతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానాల ను టీడీపీ దక్కించుకున్నట్లు పీఓ ప్రకటించారు. ఒక వేళ వైఎస్సా ర్ సీపీ కౌన్సిలర్ విజయలక్ష్మి ఓటింగ్‌కు హాజరై ఉంటే 13-13 ఓట్లతో టై అయ్యేది. దీంతో లాటరీ ద్వారా ఫలితం తేలేది.