అమడగూరు : ఓ పత్రికలో పనిచేస్తున్న రెడ్డివారిపల్లికి చెందిన విలేకరి వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన పలువురు గురువారం రాత్రి దాడికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన కొన్ని పరిణామాల వలన గ్రామానికి చెందిన ఆరుగురు ఉన్నఫలంగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు.
దాడిలో గాయపడిన వెంకటస్వామికి ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని తోటి విలేకరులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శేషురెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు.
విలేకరిపై దాడి
Published Fri, Nov 18 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
Advertisement
Advertisement