వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు! | vice chairman sharath rao | Sakshi
Sakshi News home page

వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు!

Published Wed, Jul 2 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు!

వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు!

 జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు పేరు దాదాపు ఖరారైంది. పార్టీలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు అధిష్టానానికి సన్నిహితంగా ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ కానుండటంతో, వైస్‌చైర్మన్‌ను ఓసీలకు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారు.
 
 ఆ సామాజికవర్గంలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు పార్టీకి అందించిన సేవలు, విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకొని ఆయనకే వైస్‌చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. హుస్నాబాద్ జెడ్పీటీసీ రాజిరెడ్డి, జమ్మికుంట జెడ్పీటీసీ వీరేశలింగం పోటీపడ్డప్పటికీ అధిష్టానం శరత్‌రావువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement