సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నీటి కనెక్షన్ల పై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు హైదరాబాద్ జలమండలి విజిలెన్స్ అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటి మోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో స్టాలియన్ టైర్స్ కంపెనీకు చెందిన వి.ఎమ్.ఎన్ వెంకటేష్ 40 మిల్లీ మీటర్ల నీటి కనెక్షన్లను అక్రమంగా వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
2016లో నీటి బిల్లులు చెల్లించని కారణంగా వెంకటేశ్ రూ. 29.42లక్షలు బకాయి పడ్డాడని, అందువల్ల అతని కనెక్షన్‌ను రద్దు చేశామని అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించకపోగా, అక్రమ కనెక్షన్ ద్వారా దాదాపు 25వేలకు పైగా కిలో లీటర్ల నీటిని వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా 40 లక్షల రూపాయల నీటిని అక్రమంగా వినియోగించారని, దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment