నిద్రలో కూడా ‘సిద్దిపేట’ గురించే ఆలోచన | In Villages Harish Rao Wife Srinitha Campaign | Sakshi
Sakshi News home page

నిద్రలో కూడా ‘సిద్దిపేట’ గురించే ఆలోచన

Published Thu, Dec 6 2018 11:22 AM | Last Updated on Thu, Dec 6 2018 11:22 AM

In Villages Harish Rao Wife Srinitha Campaign - Sakshi

మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత ప్రచారం 

నంగునూరు(సిద్దిపేట):  నిద్రలో కూడా సిద్దిపేట గురించే ఆలోచించే మీ హరీశ్‌రావును రికార్డు మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు అన్నారు. బుధవారం నంగునూరు మండలంలోని గట్లమల్యాల, అక్కేనపల్లి, నంగునూరు, నర్మేట, కోనాయిపల్లి, వెంకటాపూర్, ముండ్రాయి గ్రామాల్లో హరీశ్‌వుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నంగునూరులో ప్రజలను ఉద్ధేశించి శ్రీనిత మాట్లాడుతూ తెలంగాణలో సిద్దిపేటకు మంచి గుర్తింపు ఉందని మీ తీర్పుతో హరీశ్‌రావును ప్రపంచం గుర్తించాలన్నారు.

18 గంటల పాటు పని చేసే మీ నాయకున్ని లక్షకుపైగా మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి చేస్తే ఆశ్చర్యం వేస్తోందని, కోమటి చెరువుపై ఉంటే ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న అనుభూతి కలుగుతోందన్నారు. ప్రచారంలో అలసిపోయిన శ్రీనితకు నర్మేటలోని శ్రీ రామశర్మ తన ఇంట్లోకి ఆహ్వానించి మంచి నీళ్లు అందిచారు. ముండ్రాయిలోని ఓహోటల్‌లో చాయ్‌ తాగి కారు గుర్తును  ఓటేయాలని కోరారు.


కోనాయిపల్లిలో ప్రత్యేక పూజలు  
హరీశ్‌రావు సెంటిమెంట్‌ ఆలయం కోనాయిపల్లిలోని వేంకటేశ్వరాలయంలో శ్రీనిత పూజలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, హరీష్‌రావు రికార్డు మెజార్టీ సాదించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, బూర విజయ, తడిసిన ఉమా, నందాదేవి, విజిత, కవిత, మంజూల, గీత, వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, మల్లయ్య, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, బౠస్కర్‌రెడ్డి, కోటిరెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రచారి పాల్గొన్నారు    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement