
సాక్షి, వనపర్తి : వివాహేతర సంబంధం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చందునాయక్ అనే బాలుడు గత ఆదివారం కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేవలం 17 గంటల్లో కేసును పోలీసులు కేసును ఛేధించారు. అంతేకాక బాలుడు పూణేలో ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓరగట్టుకు చెందిన చందును వంశీకృష్ణ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలుడి మేనత్త నారమ్మతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉంది. ఆమెను తన వద్దకు పంపాలని లేదంటే చందునాయక్‌ను చంపుతానని వంశీకృష్ణ బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు పూణేలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు మంగళవారం అతడ్ని అరెస్టు చేశారు.