రవికిరణ్, గ్రేటర్ కమిషనర్
సాక్షి, వరంగల్ అర్బన్: ఎప్పుడు శాంతంగా కనిపించే గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవికిరణ్‌కు ఒక్కసారిగా కోపమెచ్చింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌కు సమయానికి రాని వింగ్ అధికారులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేవారు. సమయ పాటించిన ఆరుగురు మినహా అందరూ అధికారులలు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని సూచించారు. మరోమారు ఇలాగే వ్యవహరిస్తే చార్జెస్ ఫ్రేమ్ చేయాలని సూచిస్తూ తన చాంబర్‌కు వెళ్లిపోయారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ హాల్‌లో సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు సరిగ్గా ఉదయం 10–30 గంటలకు కమిషనర్ రవికిరణ్ చేరుకున్నారు. ఆ సమయంలో డీసీ గోధుమల రాజు, ఏసీపీలు మహిపాల్ రెడ్డి, సాంబయ్యతో పాటు మరో ముగ్గురు ఇంజినీర్లు మాత్రమే కనిపించా రు. దీంతో మిగిలిన వారు ఏరి ప్రశ్నించిన కమిషనర్... ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు అంటే ఎందుకింతా అలుసు.. ఎన్నిసార్లు చెప్పినా వీరి మైండ్ సెట్ మారడం లేదంటూ అసహణం వ్యక్తం చేస్తూ గైర్హాజరైన వారికి మోమోలు జారీ చేయాలని సూచించారు.
తాపీగా.. ఒక్కరొక్కరుగా...
గ్రేటర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు, వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఇంతలో వచ్చిన కమిషనర్.. ఉద్యోగులు రాలేదని గుర్తించి అసంతృప్తితో తన చాంబర్‌కు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత అడిషనల్ కమిషనర్, ఎస్‌ఈ, ఇన్‌చార్జ్ సీఈ, ఆర్‌ఎఫ్‌ఓ, టీఓ, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఆర్‌ఐలు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఇలా ఒక్కొక్కరుగా కౌన్సిల్ హాల్ చేరుకున్నారు. అందరూ వచ్చేసరికి 11–30 గంటల దాటింది. అప్పటికే హాల్ ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోవడంతో కమిషనర్ వచ్చి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ ఆదేశాలతో టీపీఓలు, టీపీబీఓలకు బల్దియా ఇన్‌చార్జ్ సీపీ నర్సింహా రాములు సాయంత్రం మెమోలు చేశారు. మిగిలిన వారికి మంగళవారం సెలవు కావడంతో బుధవారం మోమోలు జారీ చేయనున్నారని సమాచారం. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగులకు మెమోలు జారీ కావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment