
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.
9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వారి వివరాలు.
- వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్‌గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
- వరంగల్ రూరల్ జిల్లా: వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
- వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపల్ చైర్మన్‌గా గుంటి రజని కిషన్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నికయ్యారు.
- మహబూబాద్ మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఎన్నికగా, వైస్ చైర్మన్ గా మహ్మద్ ఫరిద్ ఎన్నికయ్యారు.
- మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్ గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నికయ్యారు.
- మహబూబాద్ జిల్లా: డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా వంకుడొతు వీరన్న ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కేసబోయిన కోటి లింగం ఎన్నికయ్యారు.
- మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్‌గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
- భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా సెగం వెంకట రాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కొత్త హరిబాబు ఎన్నికయ్యారు.
- జనగామ జిల్లా:జనగామ మున్సిపాలిటీ చైర్మ్‌న్‌గా పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా మేకల రాం ప్రసాద్ ఎన్నికయ్యారు
జనగామ మున్సిపల్ చైర్మన్ జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్‌లను అభినందిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment