వరంగల్ నగరపాలక సంస్థకు రూ.2.80 కోట్ల జరిమానా
బల్దియా బద్దకంతో ప్రావిడెండ్ ఫండ్ చెల్లించని వైనం
గతంలో ఈఎస్‌ఐ షాక్‌తో మారని అధికార యంత్రాంగం
కమిషనర్ చొరవతో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని వేడుకోలు
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థకు ఈపీఎఫ్ శాఖ ఝలక్ ఇచ్చింది. అవుట్ సోర్సింగ్ కార్మికుల సొమ్మును సకాలంలో జమ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పపట్టింది. రూ.2.80 కోట్ల జరిమానా చెల్లించాని హుకూం జారీ చేసింది. చెల్లించక పోతే ఆర్‌ఆర్ చట్టం కింద బల్దియా బ్యాంక్ ఖాతాల సొమ్మును రికవరీ చేసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో మహా నగరపాలక సంస్థ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. కాగా, గతేడాది కూడా బల్దియూ అధికారుల నిర్లక్ష్యంతో రూ.71 లక్షలు జరిమానా పడింది. ఈ సొమ్ము నేరుగా బల్దియా ఎస్‌బీహెచ్ బ్యాంక్ నుంచి నేరుగా ఈఎస్‌ఐ శాఖ ఖాతాల్లోకి మళ్లింది. అరుునా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడలేదు.
తీరుమారని బల్దియూ
2010 సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వం నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యంలో కాంట్రాక్టు పద్ధతిపై 1,431 మంది పారిశుదధ్య కార్మికులు, 66 మంది జవాన్లు, 277 మంది ట్రై సైకిల్ కార్మికులు, అర్బన్ మలేరియా విభాగంలో 60 మంది కార్మికులు, 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. దీంతో అదే ఏడాది ఆగస్టు నుంచి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది వేతనాల్లో ఫీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము మినహా ఇస్తున్నప్పటికీ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం లేదు. పలుమార్లు ఈఎస్‌ఐ, ఈఫీఎస్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నోటీసులు, మోమోలు అందచేశారు. అయినా బల్దియా అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టారు. దీంతో ఈపీఎఫ్ శాఖ అధికారులు బల్దియాపై కొరఢా ఝులిపించారు. సకాలంలో ఈపీఎఫ్ సొమ్ము జమ చేయని కారణంగా జరిమానగా రూ.2.80 కోట్లు చెల్లించాలని కొద్ది నెలల కిందట నోటీసులు జారీ చేశారు. తాజాగా మారోమారు ఈపీఎఫ్ శాఖ నుంచి బల్దియాకు నోటీసులు అందాయి.
ఇటీవల బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్పరాజ్ అహ్మద్ దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు. ఈపీఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొయిన్ బ్రాంచ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారులతో సమావేశమైమయ్యారు. జరిమానా సొమ్ము చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ శాఖల అధికారులు సూచించారు. జరిమానా సొమ్ము వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావాల్సి ఉందని కమిషనర్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
‘ఈపీఎఫ్’ ఝలక్
Published Fri, Feb 20 2015 12:52 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement