
కాంగ్రెస్ కిసాన్ ర్యాలీకి మేం కూడా..
హైదరాబాద్: రైతుల హక్కుల పేరిట కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ సర్కార్పై సమరానికి దిగుతోంది. ఈ నెల 19న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం కిసాన్ ర్యాలీ నిర్వహిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
భూసేకరణ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలనే సమస్యలను తమ ఎజెండాగా చేసుకొని రైతులకోసం ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలకు గాంధీభవన్లో ఉత్తమ్ పచ్చ జెండా ఊపారు.