12 గంటలు గడిస్తేగానీ చెప్పలేం: కామినేని ఆస్పత్రి వైద్యులు | We can tell after 12 hours : Kamineni hospital doctors | Sakshi
Sakshi News home page

12 గంటలు గడిస్తేగానీ చెప్పలేం: కామినేని ఆస్పత్రి వైద్యులు

Published Sun, Apr 5 2015 2:34 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

ఎస్ఐ సిద్ధయ్య (ఫైల్ ఫొటో) - Sakshi

ఎస్ఐ సిద్ధయ్య (ఫైల్ ఫొటో)

హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి 12 గంటలు గడిస్తేగానీ చెప్పలేం అని కామినేని ఆస్పత్రి వైద్యులు చెప్పారు.  నల్గొండ జిల్లా  మోత్కూరు మండలం  జానకీపురం శివారులో శనివారం ఉదయం  జరిగిన ఎదురు కాల్పుల  ఘటనలో  ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సిద్ధయ్య మెదడు, తల, ఛాతీ, పొట్టలో బుల్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ సిద్ధయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిద్ధయ్య తలలో ఉన్న బుల్లెట్ వల్ల ప్రమాదంలేదని వైద్యులు చెప్పారు.

ఇదిలా ఉండగా,  సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి ఇదే ఆస్పత్రిలో  మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement