సొమ్ము వృధాకాకుండా ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: కేసీఆర్
హైదరాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరూపాయి వృధాకాకుండా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంత ప్రాజెక్ట్‌ల ప్రయోజనాల కోసం మాత్రమే కొన్ని ప్రాజెక్ట్‌లను తెలంగాణలో నిర్మించారని, అందుకు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిదర్శనమని ఆయన తెలిపారు.
సాగర్ టేల్ పాండ్ రైతులకు నీరు ఇవ్వకుండా గోదావరిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం దారుణమని.. అలాంటి ప్రాజెక్ట్‌లకు తెలంగాణలో చోటు ఉండదని కేసీఆర్ తెలిపారు. ఈనెల 17 నుంచి కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.