గల్లీ గస్తీ పేరుతో పోలీసుల పహారా: నాయిని
హైదరాబాద్: గల్లీ గస్తీ పేరుతో టూవీలర్లపై హైదరాబాద్ లో పోలీసుల పహారా నిర్వహిస్తామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం నాయిని మాట్లాడుతూ...ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను అభివృద్ధి పరుస్తాం అని అన్నారు.
పోలీసుల పహారాకు 1650 ఇన్నోవాలు, 1550 టూవీలర్లు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. నగరంలో పటిష్టమైన భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా పోలీసింగ్‌లో పూర్తిస్థాయి మార్పులుంటాయని నాయిని తెలిపారు. తెలంగాణ పోలీసులకు కొత్త యూనిఫాం రూపొందిస్తున్నామని, డార్క్ బ్లూ ప్యాంట్, స్కై బ్లూ షర్ట్ ఉంటుందని నాయిని నర్సింహరెడ్డి మీడియాకు వెల్లడించారు.