24 గంటల కరెంటు వద్దు | We do not want 24 hours current | Sakshi
Sakshi News home page

24 గంటల కరెంటు వద్దు

Published Sat, Jul 22 2017 2:57 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

We do not want 24 hours current

గోరింటాల రైతుల తీర్మానం
 
గంభీరావుపేట(సిరిసిల్ల): ‘తమకు 24 గంటల కరెంటు వద్దని.. 9 గంటల కరెంట్‌ చాలని’ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం గోరింటాల రైతులు తీర్మానించారు. మంత్రి కేటీఆర్‌ ద్వారా తీర్మానాన్ని  ప్రభుత్వానికి పంపిస్తామని సర్పంచ్‌ వివరించారు. రైతులు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

 నిరంతర విద్యుత్‌తో బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. తమ గ్రామం పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంద న్నారు. తమ గ్రామానికి తొమ్మిది గంటల కరెంట్‌ ఇచ్చి జలవనరులను కాపాడాలని రైతులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement