మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రెండు జిల్లాలు సస్యశ్యామలం
లక్షల ఎకరాలకు సాగునీరు
అశ్వాపురం : ఖమ్మం, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమ్మగారిపల్లి పంచాయతీ పరిధిలోని పాములపల్లి వద్ద నిర్మిస్తున్న దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్రాలో కలిసిందని, దీంతో తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయూరు చేస్తోందన్నారు.
గత ప్రభుత్వ హయూంలో నిధులు వృథా అరుు.. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాని డిజైన్ మార్చి.. కోట్ల వ్యయంతో పనులు చేసి సాగు, తాగునీరు అందిస్తామన్నారు. దీంతో రెండు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్ పరిశీలించి ప్రాజెక్ట్ విధివిధానాలు ఖరారు చేస్తారన్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలతో కలిసి పరిశీలించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మువ్వావి జయబాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, చర్ల మార్కెట్ చైర్మన్ దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ శంకర్‌నాయక్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అశ్వాపురం సీఐ సాంబరాజు, తహసీల్దార్ అంజం రాజు, ఎంపీడీఓ కె.శ్రీదేవి, టీఆర్‌ఎస్ నాయకులు కందుల కృష్ణార్జున్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిటికెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యాన్ని సహించను : తుమ్మల
భద్రాచలం నుంచి సాక్షి బృందం : ‘జిల్లాలోని ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. ప్రజలకు పట్టెడన్నం పెట్టేది రైతాంగమే. నీరు లేకుంటే రైతులు ఏం చేస్తారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా పనులు పూర్తికాకపోతే ప్రయోజనం ఏమిటి’ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలంలో పుష్కర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఐబీ ఈఈ రాములు అక్కడ ఉండటంతో ‘ఈఈ గారు.. పాలెంవాగు ప్రాజెక్టు పనులు ఎక్కడ వరకు వచ్చాయి. ఏం పనులు చేస్తున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదు. కాంట్రాక్టర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమిటీ వ్యవస్థ’ అంటూ ప్రశ్నించారు. పాలెంవాగు గేట్ల ఏర్పాటు విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలో పనులు పూర్తికాకపోతే జరిగే పరిణామాలకు కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పుష్కరాల తర్వాత జిల్లా పాలనపై దృష్టి సారిస్తానని, కాంట్రాక్టర్లతోనే ప్రక్షాళన ప్రారంభిస్తానని హెచ్చరించారు. పుష్కరాల తర్వాత గోదావరి స్నానఘట్టాలకు రంగులు వేయాలని ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్‌కు సూచించారు.
‘రాజీవ్ సాగర్’ను పూర్తి చేస్తాం..
Published Wed, Jul 22 2015 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement