హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఇబ్బంది లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పునర్ విభజన చట్టాన్ని తాము ఉల్లంఘించటం లేదని, షెడ్యూల్ ప్రకారమే మార్చి 9వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జేఈఈ మెయిన్స్కు ముందు ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు నాయుడు వివాదాలకు తెరలేపుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇంటర్ఓ బోర్డు తెలంగాణలో ఉన్నందున బోర్డు..తెలంగాణకే చెందుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే ...వారికి కూడా తామే పరీక్షలు నిర్వహిస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు.
'కోరితే వారికి మేమే పరీక్షలు నిర్వహిస్తాం'
Published Tue, Dec 2 2014 2:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement