విద్యుత్ సమస్యను అధిగమిస్తాం: కేసీఆర్ | We will overcome power problem in Telangana, KCR | Sakshi
Sakshi News home page

విద్యుత్ సమస్యను అధిగమిస్తాం: కేసీఆర్

Published Wed, Oct 22 2014 1:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

We will overcome power problem in Telangana, KCR

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను నాఫ్తా, ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా అధిగమిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మంగళ వారం రాత్రి సచివాలయంలో సీఎంతో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, ఆ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. 
 
తెలంగాణకు రావాల్సిన విద్యుత్ రాకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో పవర్‌ప్లాంట్ నిర్మాణంలో రైతులు వ్యవసాయ భూములు కోల్పోకుండా చూడాలని ప్రతినిధి బృందం సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీనిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement