అల్గునూర్(మానకొండూర్): ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘సాక్షి’ జగిత్యాల డెస్క్ ఇన్‌చార్జి శ్రీమూర్తి ఆంజనేయులు కుటుంబానికి ‘సాక్షి’ఫ్యామిలీ అండగా నిలిచింది. ఆంజనేయులు కుటుంబానికి సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, నెట్‌వర్క్ ఇన్‌చార్జి శ్రీకాం త్ చెక్కురూపంలో ఆంజనేయులు భార్య శ్రావ్యకు అందించారు.
మంత్రి మాట్లాడుతూ ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహచర జర్నలిస్టు కుటుంబానికి చేయూతనిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ‘సాక్షి’సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సాక్షి బ్రాంచి ఇన్‌చార్జి శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్‌చార్జి గడ్డం రాజిరెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎడిషన్ ఇన్‌చార్జీలు బొల్లబత్తిని శ్రీనివాస్, సురేష్, ఆయా జిల్లాల డెస్క్ ఇన్‌చార్జీలు, స్టాఫ్ రిపోర్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment