వెనుకబాటుతనాన్ని పారదోలుదాం
- అందుకోసం సీఎం నడుంకట్టారు
- ఏడాదిలో జిల్లాలోని 6 లక్షల
- ఎకరాలకు సాగునీరు
- సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
- ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ
ఖిల్లాఘనపురం: సీమాంధ్రుల పాలనలో 50ఏళ్ల వెనుకబాటుతనాన్ని ఐదేళ్లలో రూపుమాపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం కట్టారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం ఖిల్లాఘనపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నాయకుల పరిపాలనలో రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే ముఖ్యమైన పథకాలను అమలుచేసేందుకు చర్య లు తీసుకున్నామన్నారు.తెలంగాణలోని ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిం చేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, బడుగు,బలహీనవర్గాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే కుటుంబాల సమగ్రసర్వే చేపట్టామని వివరించారు. ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయాలను నేరవేర్చే దిశగా ప్రభుత్వం సాగుతుందన్నారు. ప్రతిపక్షాల నాయకులు సర్వే పట్ల ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాల మూరు జిల్లా వలసలకు పెట్టింది పేరన్నా రు. అలాంటి జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. జిల్లా నుండి వలసలను నివారించాలంటే ముఖ్యంగా సాగునీరు అవసరమన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడాదిలో జిల్లాలోని 6లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి సాగు,తాగునీరందించేందుకు కృషి చేస్తామన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఖిల్లాఘనపురం మండలంలోని 25వేల ఎకరాలకు సాగునీరందించేందకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అంతకు ముందు ఆయన ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో *80 లక్షలతో నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రార భించారు. అదేపాఠశాలలో విద్యార్థులకు తాగునీరందించేందుకు *15.20 లక్షలతో నిర్మించే వాటర్‌ట్యాంకుకు శంకుస్థాపన చేశారు.
బస్టాండులో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావ్‌ఆర్య, ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు లక్ష్మారెడ్డి, బాలకృష్ణారెడ్డి, శేషాచార్యులు, రంగారెడ్డి, ఉత్తరయ్య,రవీందర్‌రెడ్డి, రాళ్ళకృష్ణ, విక్రం, ఆంజనేయులు, రాఘవేందర్‌రెడ్డి, సౌమ్యానాయక్, పీనానాయక్, పీల్యానాయక్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
జడ్చర్ల: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీకి గురువారం జడ్చర్లలో ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన హైదరాబాద్ నుండి నేరుగా జడ్చర్ల ప్రభుత్వ ఆతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద తదితరులు డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో భూ పంపిణీ, కుటుంబ సర్వేపై చర్చిం చారు. ఈ ఏడాది మొక్కజొన్న పంటకు వా తావరణ బీమా మల్లెబోయిన్‌పల్లి సింగిల్‌విండో చైర్మన్ దశరథరెడ్డి వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన వారిలో డీఎస్పీ మల్లిఖార్జున, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి,తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, సీఐ జంగయ్య తదితరులున్నారు.