మిరుదొడ్డి: బాలుర వసతిగృహంలో అడుగు పెడితేచాలు.. వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. పర్యావరణంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే అన్ని రకాల కూరగాయల మొక్కలతో దర్శనమిచ్చే కిచెన్ గార్డెన్ చూడ ముచ్చట గొలుపుతోంది. మిరుదొడ్డి మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్ ఎ. రాములు, నైట్‌వాచ్‌మన్ చిన్న ఎల్లయ్యల ప్రత్యేక చొరవతో రకరకాల కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
మార్కెట్‌లో అధిక ధరలకు కొనడం భారమవుతుండటంతో వసతీ గృహం ఆవరణలో ఉన్న నీటి వసతితో టమాటా, బెండ, దొండ, బీర, చిక్కుడు, కాకర, సోర, వంగ, కొత్తిమీర, కరివేపాకు, మునగ, మిరప, ఆకు కూరలు పండిస్తున్నారు. వివిధ కూరగాయల తోటలతో వసతిగృహం పచ్చదనాన్ని సంతరించుకుంది.
వసతిగృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ మేనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంపైనే కాకుంగా విద్యాభ్యాసంలోనూ శ్రద్ధ తీసుకుంటున్న వెల్ఫేర్ ఆఫీసర్ రాములుతో పాటు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.
ఆవరణ పచ్చగా..అందరూ మెచ్చగా
Published Fri, Oct 3 2014 1:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement