Mirudoddi
-
ఆకట్టుకొంటున్న టర్కీ కోళ్లు
మిరుదొడ్డి(దుబ్బాక) : స్వదేశంలో విదేశీకి చెందిన టర్కీ కోడి సందడి చేస్తోంది. ఇక్కడి గ్రామీణ కోళ్లతో కలివిడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఊళ్లల్లో ఉండే కోళ్ల కంటే కాస్త భిన్నంగా ఎత్తు పొడవు, బరువులో తేడా ఉండటంతో చూపరులకు ఆసక్తిని కలిగిస్తోంది.. సుమారు 8 కిలోల నుంచి 12 కిలోల బరువు తూగే ఈ టర్కీ కోళ్లు ఒక్కో దాని విలువ సుమారు రూ. 1800ల నుంచి రూ. 3 వేల ధర పలుకుతుందని వాటి సంరక్షకులు తెలుపుతున్నారు. మండల పరిధిలోని మిరుదొడ్డి అందె శివారులో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో టర్కీ కోడిని సంరక్షిస్తున్నారు. ఊరి కోళ్లతో కలివిడిగా తిరుగుతూ సందడి చేస్తున్న టర్కీ కోడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
మిరుదొడ్డి(దుబ్బాక): ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన చెప్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని లింగుపల్లిలో జరిగింది. ఘటనపై సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ విచా రణ చేపట్టారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..గ్రామానికి చెందిన పెద్దలింగన్న గారి శేఖర్(25) రెండో తరగతి చదువుతున్న చిన్నారి(07)కి చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో చిన్నారి కేకలు వేసింది. చుట్టు పక్కల ఉన్న వారి అలికిడి మొదలు కావడంతో శేఖర్ పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం సిద్దిపేట మాతాశిశు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఏసీపీ వెంట దుబ్బాక సీఐ నిరంజన్, ఎస్ఐ విజయభాస్కర్ ఉన్నారు. -
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మిరుదొడ్డి: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ఫ్), ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపును హర్షిస్తూ ఐకేపీ మండల సమాఖ్య క్లస్టర్ కో ఆర్డినేటర్లు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి బుధవారం మిరుదొడ్డిలో క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల సమాఖ్య క్లస్టర్ కో ఆర్డినేటర్ల వేతనం రూ. 6,150 నుండి, రూ. 12, వేలకు పెరగనుందన్నారు. వేతనాల పెంపునకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి, సీసీలు బాల్‌రాజ్ గౌడ్, ప్రభాకర్, సిద్ధిరాములు, వైకుంఠం, ప్రవీణ్, నాగరాజు, మణెమ్మ, ఎండీ. అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
ఆవరణ పచ్చగా..అందరూ మెచ్చగా
మిరుదొడ్డి: బాలుర వసతిగృహంలో అడుగు పెడితేచాలు.. వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. పర్యావరణంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే అన్ని రకాల కూరగాయల మొక్కలతో దర్శనమిచ్చే కిచెన్ గార్డెన్ చూడ ముచ్చట గొలుపుతోంది. మిరుదొడ్డి మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్ ఎ. రాములు, నైట్‌వాచ్‌మన్ చిన్న ఎల్లయ్యల ప్రత్యేక చొరవతో రకరకాల కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్కెట్లో అధిక ధరలకు కొనడం భారమవుతుండటంతో వసతీ గృహం ఆవరణలో ఉన్న నీటి వసతితో టమాటా, బెండ, దొండ, బీర, చిక్కుడు, కాకర, సోర, వంగ, కొత్తిమీర, కరివేపాకు, మునగ, మిరప, ఆకు కూరలు పండిస్తున్నారు. వివిధ కూరగాయల తోటలతో వసతిగృహం పచ్చదనాన్ని సంతరించుకుంది. వసతిగృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ మేనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంపైనే కాకుంగా విద్యాభ్యాసంలోనూ శ్రద్ధ తీసుకుంటున్న వెల్ఫేర్ ఆఫీసర్ రాములుతో పాటు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. -
ప్రకృతి ఒడిలో సంక్షేమ వసతి గృహాలు
మిరుదొడ్డి: బాలుర వసతిగృహంలో అడుగు పెడితేచాలు.. వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. పర్యావరణంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే అన్ని రకాల కూరగాయల మొక్కలతో దర్శనమిచ్చే కిచెన్ గార్డెన్ చూడ ముచ్చట గొలుపుతోంది. మిరుదొడ్డి మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్ ఎ. రాములు, నైట్‌వాచ్‌మన్ చిన్న ఎల్లయ్యల ప్రత్యేక చొరవతో రకరకాల కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్కెట్లో అధిక ధరలకు కొనడం భారమవుతుండటంతో వసతీ గృహం ఆవరణలో ఉన్న నీటి వసతితో టమాటా, బెండ, దొండ, బీర, చిక్కుడు, కాకర, సోర, వంగ, కొత్తిమీర, కరివేపాకు, మునగ, మిరప, ఆకు కూరలు పండిస్తున్నారు. వివిధ కూరగాయల తోటలతో వసతిగృహం పచ్చదనాన్ని సంతరించుకుంది. వసతిగృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ మేనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంపైనే కాకుంగా విద్యాభ్యాసంలోనూ శ్రద్ధ తీసుకుంటున్న వెల్ఫేర్ ఆఫీసర్ రాములుతో పాటు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.