టర్కీ కోడి
మిరుదొడ్డి(దుబ్బాక) : స్వదేశంలో విదేశీకి చెందిన టర్కీ కోడి సందడి చేస్తోంది. ఇక్కడి గ్రామీణ కోళ్లతో కలివిడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఊళ్లల్లో ఉండే కోళ్ల కంటే కాస్త భిన్నంగా ఎత్తు పొడవు, బరువులో తేడా ఉండటంతో చూపరులకు ఆసక్తిని కలిగిస్తోంది..
సుమారు 8 కిలోల నుంచి 12 కిలోల బరువు తూగే ఈ టర్కీ కోళ్లు ఒక్కో దాని విలువ సుమారు రూ. 1800ల నుంచి రూ. 3 వేల ధర పలుకుతుందని వాటి సంరక్షకులు తెలుపుతున్నారు. మండల పరిధిలోని మిరుదొడ్డి అందె శివారులో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో టర్కీ కోడిని సంరక్షిస్తున్నారు. ఊరి కోళ్లతో కలివిడిగా తిరుగుతూ సందడి చేస్తున్న టర్కీ కోడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment