బండారం బట్టబయలు! | Welfare schemes not implemented | Sakshi
Sakshi News home page

బండారం బట్టబయలు!

Published Tue, Feb 23 2016 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

బండారం బట్టబయలు!

బండారం బట్టబయలు!

సంక్షేమ పథకాల లబ్ధిదారుల రికార్డులు మాయం
వివరాలు తమ వద్ద లేవంటూ చేతులెత్తేసిన వైనం
2011 ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీపై అనుమానాలు
రూ.22.05కోట్లకు యూసీలు సమర్పించని
అధికారులువ్యవసాయశాఖ డెరైక్టర్ సమీక్షలో వెలుగులోకి..
లబ్ధిదారుల జాబితాను తన దగ్గర ఉంచాలి
అధికారులకు డెరైక్టర్ జీడీ ప్రియదర్శిని ఆదేశం
 

మహబూబ్‌నగర్ వ్యవసాయం
: పథకం అమలుచేశారు..కానీ లబ్ధిదారుల రికార్డులు మాయం.. ఇలా ఒక్క పథకం కాదు.. అన్నీంటిలోనూ ఇదే వరుస. ఎందుకు ఇలా చేశారంటే..తమ హయాంలో కాదంటూ పక్కకు తప్పుకునేందుకు యత్నం.. ఒక ఏడీఏ సొంత ఫర్మ్‌తో అవినీతికి పాల్పడినట్లు గుర్తించి విచారణకు ఆదేశించిన కొద్ది రోజుల్లోనే వ్యవసాయశాఖలో మరో అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమీక్షలో వెలుగుచూసిన అంశాలను బట్టి చూస్తుంటే వీరి అనుమానాలు నిజమేనా అన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లాలో అమలు అవుతున్న వ్యవసాయ సంబంధ సంక్షేమ పథకాలపై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్షించారు. 

ఆర్‌కేవీవై పథకంపై సమీక్ష చేస్తుండగా..2014-15 వార్షిక ఏడాదిలో ఈ పథకం కింద 320 రోటవేటర్లు పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. బిజినపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల్ డివిజన్లలో 150 రోటవేటర్లు పంపిణీ చేసినట్లు గుర్తించగా, అయితే లబ్ధిదారుల రికార్డులేవీ అంటూ డెరైక్టర్ ప్రశ్నించారు. తమ సమయంలో పంపిణీ చేయలేదని, తమకు తెలియదని అధికారులు పొంతన లేని మాటలు చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన డెరైక్టర్ ఆ వార్షిక ఏడాదిలో పంపిణీ చేసిన లబ్ధిదారుల లిస్టును రెండు రోజుల్లో  తమకు అందించాలని టెక్నికల్ ఏఓను ఆదేశించారు.


 నిధుల వివరాలు లేవంటా..
జిల్లాలో పథకాల వారీగా ఎన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి..ఎన్ని పంపిణీ చేశారని రికార్డులు తేవాలని సిబ్బందిని ఆదేశించగా ఒకరిపై నొకరు బొంకుతూ చేతులు ఎత్తేశారు. ఇలా జిల్లాలో ప్రధానంగా అమలవుతున్న ఎన్‌ఎంఓఓపీ పథకం, ఎన్‌ఎస్‌పీ, ఆర్‌కేవీవై, ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎం, ఎస్‌ఎంఏఎం పథకాల అమలు ద్వారా పంపిణీ చేసిన ఇన్‌పుట్ లోనూ అవ కతవకలు జరిగినట్లు డెరైక్టర్ గుర్తించారు. అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ లబ్ధిదారుల వివరాలను తన ముందు ఉంచాలన్నారు.

 2011 ఇన్‌పుట్ సబ్సిడీ యూసీలు ఇంకా ఇవ్వని వైనం
2011లో ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ.22.05కోట్లకు చెందిన యూసీలు సమర్పించకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి సమగ్ర వివరాలు అందుబాటులో ఉంచాలని, త్వరలో జిల్లా సమీక్ష చేస్తానని, వివరాలు అందించని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  అనంతరం మూడేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలతీరును క్షుణంగా పరిశీలించాలని జేడీఏ బాలును ఆమె ప్రత్యేకంగా ఆదేశించారు. పథకాల లబ్ధిదారుల వివరాల ను సమగ్రంగా సేకరించి పరిశీలిస్తే అవినీతి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 కాగితాలకే సంక్షేమ పథకాలు పరిమితమా?
 సంక్షేమ పథకాలన్ని కాగితాలకే పరిమితం అయ్యాయని,  క్షేత్రస్థాయిలో అమలు కావ డం లేదంటూ వ్యవసాయశాఖ డెరైక్టర్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే టార్గెట్‌లు జేడీఏ కార్యాలయం వరకే పరిమితమవుతున్నాయని, ఏడీఏ, ఏఓల వరకు పో వడం లేదని, దీంతో రైతులకు అందే ప రిస్థితి కనిపించడం లేదన్నారు. కిసాన్‌పోర్టల్‌లో రైతుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులందరి పేర్లను పోర్టల్‌లో పొందుపర్చాలన్నారు. ఏడీఏలు, ఏఓలు స్థానికంగా  అందుబాటు లో ఉంటూ పనిచేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement