తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం! | white paper in printed govt logo certificates | Sakshi
Sakshi News home page

తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం!

Published Mon, Mar 16 2015 4:49 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం! - Sakshi

తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం!

* మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నిండుకున్న ప్రభుత్వ లోగో సర్టిఫికెట్లు
* ధ్రువీకరణ పత్రాల్ని తెల్లకాగితాలపై ప్రింట్ చేసి ఇస్తున్న వైనం
* నిర్వాహకుల మొర ఆలకించని జిల్లా కార్యాలయ అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులభంగా, వేగంగా అందించే పౌరసేవల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా రెవెన్యూ తదితర సేవలందించేందుకు ప్రభుత్వం మీ సేవ, ఈ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఆన్‌లైన్ పద్ధతిలో సేవలందించడమే వీటి ప్రధాన లక్ష్యం. కానీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి తలకిందులైంది. ఆన్‌లైన్ పద్ధతిలో కోరిన ధ్రువీకరణ వస్తున్నప్పటికీ.. అవన్నీ కంప్యూటర్ వరకే పరిమితమవుతున్నాయి. వాటిని ప్రభు త్వ ధ్రువీకరణతో ఇవ్వడం ఆయా కేంద్రాల నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ లోగోతో ముద్రించిన ధ్రువీకరణ పత్రాలు మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
 
జిల్లాలో 526 ఆన్‌లైన్ కేంద్రాలున్నాయి. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 165 కేంద్రాలుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 139 ఆన్‌లైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 222 ఈసేవ కేంద్రాల ద్వారా పౌరసేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రధానంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, ఈసీ తదితర ధ్రువీకరణ పత్రాలన్నీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా పొందుతున్నారు. కానీ వారం రోజులుగా జిల్లాలోని పలు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో తెలంగాణ లోగోతో ఉన్న సర్టిఫికెట్లు నిండుకున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరిన్ని దరఖాస్తులివ్వాలంటూ జిల్లా కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు.
 
ఉపకార‘వేతలు’:2014-15 సంవత్సరానికి సంబ ంధించి ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టింది. వార్షిక సంవత్సరం చివర్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావడం, మరోైవె పు పరీక్షలు సైతం ముంచుకొస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితిల్లో మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నూతన కుల, ఆదాయ ధ్రువీకరణ కోసం అర్జీలు పెట్టుకోగా.. నిర్వాహకులు సర్టిఫికెట్లు లేవం టూ సమాధానం చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు.

దరఖాస్తుకు గడువు ముం చుకొస్తుండగా.. కుల, ఆదాయ ధ్రువీకరణ లేకపోవడంతో విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఈసీలు, పహానీల అవసరం భారీగా ఉంటుంది. కానీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు నిండుకోవడంతో తెల్లకాగితాలపైనే పొందాల్సివస్తోందని యా చారం గ్రామస్తుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement