white papers
-
చంద్రబాబు శ్వేత పత్రాలపై విజయసాయిరెడ్డి కౌంటర్
న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ ఉండడం లేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘టీడీపీ ప్రభుత్వం పెడుతున్న శ్వేతపత్రాలతో.. తమ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చబోమని చేయబోమని చెప్పినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వాటితో ప్రజలు విసుగుచెందారంటే.. ఊరుకోరు. సవాళ్లకు భయపడే చంద్రబాబు.. మిత్రపక్షాల కోసమే పరుగులు తీస్తుంటారని ఎద్దేవా చేశారాయన.ఇదిలా ఉంటే.. కూటమి పాలనలో నెలరోజుల్లోనే రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ఇంతకు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.The White Papers issued by TDP govt. in AP are nothing but excuses by the TDP govt. to not work in their tenure. Once people are disappointed, they will use this as an excuse. @ncbn is always scared of challenges and will run to his allies.— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 -
బాబు పైశాచిక పాలన.. బద్దలు కొట్టిన జగన్
-
చంద్రబాబు శ్వేత పత్రాలపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం!
* మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నిండుకున్న ప్రభుత్వ లోగో సర్టిఫికెట్లు * ధ్రువీకరణ పత్రాల్ని తెల్లకాగితాలపై ప్రింట్ చేసి ఇస్తున్న వైనం * నిర్వాహకుల మొర ఆలకించని జిల్లా కార్యాలయ అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులభంగా, వేగంగా అందించే పౌరసేవల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా రెవెన్యూ తదితర సేవలందించేందుకు ప్రభుత్వం మీ సేవ, ఈ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పద్ధతిలో సేవలందించడమే వీటి ప్రధాన లక్ష్యం. కానీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి తలకిందులైంది. ఆన్లైన్ పద్ధతిలో కోరిన ధ్రువీకరణ వస్తున్నప్పటికీ.. అవన్నీ కంప్యూటర్ వరకే పరిమితమవుతున్నాయి. వాటిని ప్రభు త్వ ధ్రువీకరణతో ఇవ్వడం ఆయా కేంద్రాల నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ లోగోతో ముద్రించిన ధ్రువీకరణ పత్రాలు మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 526 ఆన్లైన్ కేంద్రాలున్నాయి. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 165 కేంద్రాలుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 139 ఆన్లైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 222 ఈసేవ కేంద్రాల ద్వారా పౌరసేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రధానంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, ఈసీ తదితర ధ్రువీకరణ పత్రాలన్నీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా పొందుతున్నారు. కానీ వారం రోజులుగా జిల్లాలోని పలు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో తెలంగాణ లోగోతో ఉన్న సర్టిఫికెట్లు నిండుకున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరిన్ని దరఖాస్తులివ్వాలంటూ జిల్లా కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు. ఉపకార‘వేతలు’:2014-15 సంవత్సరానికి సంబ ంధించి ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టింది. వార్షిక సంవత్సరం చివర్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావడం, మరోైవె పు పరీక్షలు సైతం ముంచుకొస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితిల్లో మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నూతన కుల, ఆదాయ ధ్రువీకరణ కోసం అర్జీలు పెట్టుకోగా.. నిర్వాహకులు సర్టిఫికెట్లు లేవం టూ సమాధానం చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. దరఖాస్తుకు గడువు ముం చుకొస్తుండగా.. కుల, ఆదాయ ధ్రువీకరణ లేకపోవడంతో విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఈసీలు, పహానీల అవసరం భారీగా ఉంటుంది. కానీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు నిండుకోవడంతో తెల్లకాగితాలపైనే పొందాల్సివస్తోందని యా చారం గ్రామస్తుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. -
ఆర్ధిక స్ధితిపై శ్వేతపత్రం
-
ఆరు వాస్తవ పత్రాలు విడుదల చేస్తాం:బాబు
-
ఆరు అంశాలపై శ్వేతపత్రాలు!
-
ఆరు అంశాలపై శ్వేతపత్రాలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆరు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ మాదిరి గానే మరో డాక్యుమెంట్‌ను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన తన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ రం గాలు, విద్యుత్ రంగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆయా రంగాల్లో గత పదేళ్లలో జరిగిన అవినీతిని కూడా వివరిస్తామని చెప్పారు. విభజన వల్ల తలెత్తిన సమస్యలపై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, అవి ముగిసిన వెంటనే ఆయా పత్రాలను విడుదల చేసి ప్రజల్లో, అసెంబ్లీలో వాటిపై చర్చిస్తామన్నారు. ప్రజలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా తమ పరిపాలన సాగుతందని బాబు తెలిపారు. అభివృద్ధితోపాటు పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. గతంలో విజన్ డాక్యుమెంట్‌ను అందరూ ఎగతాళి చేశారని, చివరకు దాన్నే జాతీయ స్థాయిలో కూడా అనుసరించారని అన్నారు. తమ విజన్ డాక్యుమెంట్లో రానున్న 3 ఆర్థిక సంఘాల నుంచి నిధులు రాబట్టేందుకు ఏయే అంశాలను ప్రతిపాదించాలో పొందుపరుస్తామన్నారు. రాష్ర్టంలో పారదర్శకత లేకుండా పోయిం దని, వ్యవస్థలను నాశనం చేశారని ఈ నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తాము కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయంగా సాయం చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కావాలని, వాటిని సాధించేందుకు మార్గాలు వెతుకుతామన్నారు. టైటానియం కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం వచ్చే వరకూ తాను హైదరాబాద్‌లో ఉంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామన్నారు.