12 లక్షణాల కరోనా! | WHO Revealed Common Symptoms of Corona Virus | Sakshi
Sakshi News home page

12 లక్షణాల కరోనా!

Published Thu, Apr 23 2020 2:12 AM | Last Updated on Thu, Apr 23 2020 10:42 AM

WHO Revealed Common Symptoms of Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌... మానవ శరీరంలో ఇప్పుడు ఎలాంటి మార్పు కనిపించినా కలిగే సందేహం ఇదే. వైరస్‌ లక్షణాలు కొందరికి కనిపిస్తుంటే, మరి కొందరికి ఎలాంటి లక్షణాలూ లేకుండానే ఈ వైరస్‌ బారిన పడుతున్నారని వైద్య పరీక్షల్లో తేలుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఈ వైరస్‌ వచ్చి ఉంటుందని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముందు నుంచీ వినిపిస్తున్న మాట.

ఇవే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వైరస్‌ సోకిన వారిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిందేమో తెలుసుకునేందుకు 12 రకాల లక్షణాలను ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ ప్రాథమికంగా వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో కనిపించిన శారీరక మార్పులను గుర్తించి ఈ లక్షణాలు ఎంత శాతం మందిలో కనిపిస్తున్నాయో లెక్క తేల్చింది. ఇందులో జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలే కాదు అలసట, విరేచనాలు, తలనొప్పి లాంటివి కూడా ఉన్నాయని తేల్చింది. 

కరోనా లక్షణాలు ఇవిగో.. 
► ఈ పట్టిక ప్రకారం ఒక లక్షణం మాత్రం కరోనా సోకిన అందరిలో కనిపించిందన్నమాట. కొందరిలో ఒకటే లక్షణం ఉండగా, మరికొందరిలో 2, 3 లక్షణాలు కూడా కనిపించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో ఏ ఒక్క లక్షణం రోజుల తరబడి కనిపించినా వైద్య పరీక్షలు చేయిస్తే మంచిదని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement