సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్‌లోని పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపంలోని నీలాద్రి అడవుల్లో వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, నీలాద్రీశ్వర ఆలయ సమీపంలో రోడ్డుపై స్కార్పియో వాహనం కంటపడింది. సమీపంలోనే అడవిలో వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్లిన ఫారెస్టు అధికారులకు మృతి చెందిన చుక్కల దుప్పి, పక్కనే ఇద్దరు తుపాకీతో కన్పించారు.
దీంతో నిందితులైన పెనుబల్లి మండలం భవన్నపాలెం, బీజేఆర్ క్యాంప్‌లో డ్రైవర్.. షూటింగ్ ఎక్స్‌పర్ట్ అయిన సాధం శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా మైలవరం, రైస్‌మిల్లులో వర్కర్ సోమవరం చిట్టిబాబులను అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, సత్తుపల్లి శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చుతున్న కూరాకుల రామారావు, జల్లిపల్లి విజయ్‌కుమార్, ముడియం తిరుపతిరావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
Published Thu, May 21 2015 1:45 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
Advertisement