‘సాక్షి’ కథనంపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, హైదరాబాద్: ఫార్మసిస్ట్‌లు, మందుల సరఫరాదారుల కుమ్మక్కుపై ప్రభుత్వం స్పందిం చింది. ‘కమీషన్ల కొనుగోళ్లు’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా మందుల కొనుగోలుకు సంబంధించి రెండేళ్ల నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రెండేళ్లుగా ఏ సరఫరాదారునికి ఎంత మోతాదులో ఆర్డర్ ఇచ్చారు, వాటి రేటు ఎంత అనే వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర మౌలిక వైద్యసేవలు, సదుపాయాల సంస్థ సిబ్బంది నిమగ్నమయ్యారు. వీటిని పరిశీలించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
అయితే అమాక్సిక్ క్లావ్‌లిక్ యాసిడ్ అనే దగ్గు మందును తమిళనాడులో కంటే 100 శాతం ఎక్కువ రేటుతో కొనుగోలు చేసినట్టు తేలింది. ఇదిలావుండగా కొద్ది రోజుల్లో 2015-16 సంవత్సరానికి తొలి త్రైమాసికం కొనుగోలు ఆర్డర్లు పెట్టాల్సి ఉంది. అయితే నాలుగేళ్లుగా డెప్యుటేషన్‌పై అక్కడే కొనసాగుతున్న ఫార్మసిస్ట్‌లు కొందరు తొలి త్రైమాసిక ఆర్డర్లు పెట్టేవరకైనా ఇక్కడే ఉండేందుకు యత్నిస్తున్నారు. వారి కోసం కొంతమంది సరఫరాదారులు కూడా పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. సుమారు రూ.40 కోట్లకు ఆర్డర్లు ఉండడంతో భారీగా కమీషన్లు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.
‘కమీషన్ల కొనుగోళ్ల’పై నివేదిక ఇవ్వండి
Published Fri, Apr 24 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement