శాతవాహనుల నగరం వెలుగుచూసేనా? | Will see the city of Satavahan ? | Sakshi
Sakshi News home page

శాతవాహనుల నగరం వెలుగుచూసేనా?

Published Fri, Jun 9 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

Will see the city of Satavahan ?

సాక్షి,మంచిర్యాల: రెండువేల సంవత్సరాల నాటి శాతవాహ నుల వర్తక, వాణిజ్య నగరం కర్ణమామిడి చరిత్రను వెలికి తీసేందుకు పురా వస్తు శాఖ చేస్తున్న ప్రయత్నాలకు వాతావ రణం అనుకూలించడం లేదు. ఎల్లంపల్లి ప్రాజె క్టులో ముంపు నకు గురైన ఈ ప్రాంతం నీటి నిల్వలు తగ్గడంతో ఇటీవలే తేలింది.

ఈ మేరకు 6వ తేదీన పురావస్తు శాఖ తవ్వకాలు ప్రారంభించగా.. అదే రోజు రాత్రి నుంచి కురు స్తున్న వర్షాలు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి. వర్షం కురిసినప్పుడు ఇక్కడి నేల బంకగా మారుతుందని, తవ్వకాలు జరిపితే పురా తన నాణేలు, ఇతర వస్తువుల ఆనవాళ్లు దొరకవని అధికారు లు చెబుతున్నారు. 45 రోజులపాటు 15 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరపాలనేది ప్రణాళిక కాగా, వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం నుంచి తవ్వకాలు కొనసాగిస్తామని పురావస్తు శాఖ అధికారి రాములు నాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement