పర్యాటక అభివృద్ధితో ఉపాధి
- సమష్టిగా జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం
- ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ : చారిత్రక వరంగల్ జిల్లాను పర్యాటక రంగంగా ప్రపంచస్థాయి దృష్టిని ఆకర్షించేలా అందరూ సమష్టిగా కృషి చేద్దామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. ఈ నెల 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘వన్ బిలియన్ టూరిస్ట్స్ - వన్ బిలియన్ అపర్ట్యునిటీస్’ అనే అంశంపై సద స్సుజరిగింది. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు.
తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో చారిత్రక, వారసత్వ సంపద, పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి పరిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. భద్రకాళి చెరువు కట్ట అభివృద్ధి చేసి, చెరువు మధ్యలో మెడిటేషన్ రాక్ ఏర్పాటుకు, రోప్‌వే ఏర్పాటుకు తదితర పనులకు రూ.15 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు.
స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రం గ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను కూడా రిలయన్స్, స్పెన్సర్ లాంటి మాల్‌లో కనీసం 30 శాతం ఉండే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానన్నారు. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ, పర్యాటక పరంగా అభివృద్ధి జరగాలంటే రవాణా, భోజన వసతి, గైడ్స్ ఏర్పాటులాంటి సౌకర్యాలు కల్పించాలని కోరా రు. డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు పర్యాటకంగా అభివృద్ధి నోచుకోని అనేక ప్రదేశాలకు ప్రస్తు తం మంచిరోజు లొచ్చాయన్నారు. యువతకు పర్యాటక రంగంలో శిక్షణ ఇవ్వడ ం ద్వారా వారికి జీవనోపాధి కల్పించవచ్చునని అన్నారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ సుబ్రమణ్య, సమాచార శాఖ ఉప సంచాలకులు డీఎస్ జగన్, జిల్లా పర్యాటక శాఖాధికారి శివాజి, పర్యాటక శాఖ ఉద్యోగులు వంశీమోహన్, సూర్య కిరణ్, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.